మరోసారి అలరించనున్న ఏఎన్నార్

anr

అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తుతం మనమధ్య లేరు. కానీ ఆయన సినిమాలు మాత్రం మనల్ని నిత్యం అలరిస్తూనే ఉంటాయి. అయితే ఓ కొత్త సినిమాతో అక్కినేని మరోసారి ఫ్రెష్ గా తెరపైకి రాబోతున్నారు. ఆ గమ్మత్తు నాగార్జున కొత్త సినిమాతో షురూ కాబోతోంది. అవును… నాగార్జున నటిస్తున్న ఓం నమోవేంకటేశాయ చిత్రంలో ఓ పాత్ర కోసం ఏఎన్నార్ ను సెలక్ట్ చేశారు. గ్రాఫిక్స్ తో అక్కినేనిని రీ-క్రియేట్ చేసి ఆ పాత్రను కల్పిస్తారట.నిజానికి ఇలా గ్రాఫిక్స్ తో అలనాటి నటుల్ని చూపించడం కొత్తేంకాదు. కాకపోతే… ఏకంగా ఓ పాత్రనే కేటాయించడం మాత్రం కొత్త విషయమే. తాజాగా ఇలాంటిదే ఓ మాయాజాలం జరిగింది.

కన్నడ నటుడు విష్ణువర్థన్ 2009లో కన్నుమూశాడు. అతడు ప్రారంభించిన ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తాజాగా విష్ణువర్థన్ ను గ్రాఫిక్స్ లో క్రియేట్ చేసి, ఆ సినిమాను పూర్తిచేశారు. అదే తెలుగులో నాగభరణంగా కూడా రాబోతోంది.సరిగ్గా ఇప్పుడు అదే టెక్నాలజీతో ఓంనమోవేంకటేశాయ చిత్రంలో నాగేశ్వరరావును చూపించబోతున్నారట. సినిమాలో పరమ పవిత్రమైన ఓ పాత్రను అక్కినేనికి కేటాయించినట్టు తెలుస్తోంది. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నప్పటికీ… ఈ గ్రాఫిక్స్ వల్ల మరింత ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయని.. నాగార్జున స్వయంగా ప్రకటించాడు.

Loading...

Leave a Reply

*