సమంత కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున

samnatha

నాగచైతన్యతో పెళ్లి కావాలంటే సినిమాలు వదిలేయాలనేది అతిపెద్ద కండిషన్. నాగార్జున పెట్టిన ఈ అతిపెద్ద కండిషన్ కు సమంత ఒప్పుకుంది. తెలుగులో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న టైమ్ లో సినిమాలు వదిలేసుకుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఇలా నాగార్జున మాట కోసం, ప్రియుడు నాగచైతన్య కోసం తన కెరీర్ నే త్యాగం చేసింది సమంత. అందుకే సమంత కోసం ఇప్పుడు నాగార్జున ఓ చిన్న పని చేశాడు.

సినిమాలు విడిచిపెట్టకముందే సమంతకు కన్నడలో హిట్ అయిన యు-టర్న్ అనే సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చింది. నాగచైతన్యతో కలిసి ఈ సినిమా చూసిన సమంత.. కుదిరితే ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించానుకుంది. రీమేక్ రైట్స్ కూడా తనే తీసుకొని, సొంతంగా నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి అప్పట్లో. అయితే చైతూ కోసం అన్నింటినీ వదిలేసింది. నాగ్ కు ఇచ్చిన మాట ప్రకారం… సినిమాలు వదిలేసుకుంది.

అయితే నాగార్జున మాత్రం సమంత కోసం యు-టర్న్ సినిమా రీమేక్ రైట్స్ కొనుగోలు చేశాడట. కుదిరితే ఆ సినిమాను అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే నిర్మించాలని అనుకుంటున్నాడట. ఫిమేల్ ఓరియంటెండ్ మూవీగా, సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంతకు నటించే అవకాశం ఇస్తాడని కూడా అంటున్నారు. అలా అన్నపూర్ణ స్టుడియోస్ సినిమాతో సమంత కెరీర్ కు ఎండ్ కార్డ్ వేయాలని నాగ్ భావిస్తున్నాడట.

Loading...

Leave a Reply

*