నాగ్ కు నిద్రలేకుండా చేస్తున్న ఓంకార్ అన్నయ్య

omkar

రాజుగారి గది సీక్వెల్ లో నాగార్జున నటించబోతున్నాడనే విషయం పాతదే. దీనిపై అఫీషియల్ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రానప్పటికీ.. జనాలందరికీ చేరాల్సిన మేటర్ చేరిపోయింది. ఇదిలా ఉండగా… రీసెంట్ గా నాగార్జున చెప్పిన కొన్ని మాటలు రాజుగారి గది సీక్వెల్ చేస్తున్నాననడానికి బలం చేకూర్చాయి. కచ్చితంగా నాగ్.. ఈ హారర్ కామెడీ సీక్వెల్ చేస్తాడని అనిపిస్తోంది.తాజాగా సుమంత్ నటించిన నరుడా డోనరుడా సినిమా ఆడియో ఫంక్షన్ కు నాగార్జున హాజరయ్యాడు.

ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో తన కెరీర్ గురించి మాట్లాడాడు. కొత్తగా ఉంటే ఏ కథనూ కాదననని, నరుడా డోనరుడా లాంటి కథతో నన్ను అడిగినా చేసేవాడినని అన్నారు. ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ చేస్తున్నానని, ఆ తర్వాత కొత్త జానర్లో ట్రై చేద్దామని అనుకుంటున్నానని నాగ్ హింట్ ఇచ్చాడు. రీసెంట్ గా ఓ కథ కూడా విన్నానని, అది విన్నప్పటి నుంచీ నిద్ర కూడా పట్టడం లేదని, ఆ కథ అంత బాగుందని నాగార్జున చెప్పాడు.

అయితే, నాగ్ తనకు నిద్ర లేకుండా చేస్తోన్న ఆ కథలో అంత ప్రత్యేకత ఏముందో, అలాగే ఆ కథ చెప్పింది ఎవరో కూడా వెల్లడించలేదు. ఆ కథ ఓంకార్ అన్నయ్య చెప్పిందే అయి ఉంటుందని… అది రాజుగారి గది సీక్వెల్ అయి ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తనే ఆ సినిమాను నిర్మించాలని కూడా నాగ్ భావిస్తున్నాడట.

Loading...

Leave a Reply

*