తండ్రి సెంటిమెంట్ ను తొక్కి నారతీసిన చైతన్య

nagarjuna

నాగార్జున మన్మధుడే. అందగాడే కాదు, స్టోరీ సెలక్షన్ లో కూడా మొనగాడే. నాగ్ సెలక్షన్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో, మార్కెట్ కూడా అదేస్థాయిలో ఉంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం నాగ్ లెక్క ఎప్పుడూ తప్పుతూనే ఉంది. అదే గెస్ట్ రోల్స్. అవును.. నాగార్జున గెస్ట్ రోల్ చేసినా ప్రతి సినిమా బాల్చీ తన్నేసింది. వామ్మో… అందులో నాగార్జున గెస్ట్ రోల్ చేశాడా అని భయపడే రేంజ్ కు జనాల్ని తీసుకొచ్చాడు మన్మధుడు. ఈ ఒక్క బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం నాగ్ ను వెనక్కి లాగుతోంది. అయితే ఇప్పుడు కొడుతు దయవల్ల నాగ్ అందులోంచి కూడా బయటపడ్డాడు. ప్రేమమ్ సినిమాలో నాగ్ గెస్ట్ రోల్ చేశాడు. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అవ్వలేదు. హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

అలా నాగార్జున బ్యాడ్ సెంటిమెంట్ ను నాగార్జున అవతలకి తీసి పారేశాడు.అతిథి పాత్రల్లో నాగార్జునది ఐరెన్ లెగ్ అనే ఇమేజ్ ఇప్పటిది కాదు. కెరీర్‌లో ఇప్ప‌టిదాకా మ‌న్మ‌ధుడు కృష్ణార్జున, త‌కిట త‌కిట‌, అఖిల్‌, నిర్మ‌లా కాన్వెంట్ వంటి చిత్రాల‌లో గెస్ట్ రోల్స్ పోషించాడు నాగార్జున. ఇవేవీ హిట్ కాలేదు. నిర్మలా కాన్వెంట్ సినిమా అయితే మొదటికే దెబ్బకొట్టింది. దీంతో నాగార్జునపై ఈ సెంటిమెంట్ బలంగా స్థిరపడిపోయింది. తాజాగా నాగచైతన్య ఆ సెంటిమెంట్ ను క్రాస్ చేశాడు. ప్రేమమ్ లో చైతూకు తండ్రిగా నాగ్ కనిపిస్తాడు. మూవీ స‌క్సెస్ టాక్‌తో నాగ్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అందుకేనేమో చైతన్యను కౌగలించుకోవాలని ఉందంటూ నాగ్ ట్వీట్ కూడా చేశాడు.

Loading...

Leave a Reply

*