నాగార్జున సరసన మరోసారి త్రిష…

untitled-14

పైకి మన్మధుడు అనిపించుకుంటున్నప్పటికీ… నాగార్జునకు కూడా హీరోయిన్లు దొరకడం కాస్త కష్టమైన పనే. మనం సినిమాలో శ్రియతో సరిపెట్టేసుకున్నాడు. ఊపిరి సినిమాలో అసలు హీరోయిన్నే లేదు. మధ్యలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఎలాగోలా రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠితో మేనేజ్ చేశారు. ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్నది భక్తిరస చిత్రం కాబట్టి.. దీనికి కాంబినేెషన్ తో పనిలేదు. అందుకే కీలక పాత్రలో అనుష్క… హీరోయిన్లుగా విమలా రామన్, ప్రగ్యా జైశ్వాల్ తో పని కానిచ్చేస్తున్నారు. కానీ రాబోయే సినిమాకు మాత్రం నాగ్ సరసన కచ్చితంగా ఓ గ్లామర్ క్వీన్ కావాలి.

ఓం నమో వేంకటేశాయ సినిమా కంప్లీట్ అయిన తర్వాత… రాజుగారి గది సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడు నాగార్జున. తొలిభాగంలో అంతా చిన్న నటీనటులే కాబట్టి పని సులువైపోయింది. కానీ సీక్వెల్ లోకి నాగార్జున వచ్చాడు కాబట్టి.. అంతా రిచ్ గా ఉండాలి. హీరోయిన్ కూడా స్టార్ అయి ఉండాలి. అందుకే నాగ్ కోసం మరోసారి త్రిష పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో నాగార్జున, త్రిష కలిసి కింగ్ సినిమా చేశారు. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలుసుకోలేదు. అటు త్రిష కూడా ఫిమేల్ ఓరింటెడ్ సినిమాలతోబిజీ అయిపోయింది. అయితే ఈమధ్య మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ తో పాటు.. గ్లామర్ డోస్ కూడా చూపిస్తుండడంతో…త్రిష అయితే ఈ సీక్వెల్ కు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట.

Loading...

Leave a Reply

*