మరోసారి మన్మధుడి గెటప్ లోకి…

nag

కింగ్ సినిమాలో నాగార్జున స్పెషల్ సాంగ్ గుర్తుందా… అందులో ఓ పాటలో నాగార్జునతో గతంలో నటించిన ముద్దుగుమ్మలంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. ఓంశాంతిఓం సినిమాలోని పాటకు పేరడీగా నాగార్జున తెలుగులో ఆ పాట పెట్టుకున్నాడు. తన చిలిపి కోరికను తీర్చుకున్నాడు. సరే.. ఆ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు అదే పాటను ఫుల్ లెంగ్త్ సినిమాగా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రారంభమైంది. అవును.. గతంలో తను నటించిన హీరోయిన్లందర్నీ రిపీట్ చేస్తూ… ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నాగార్జునకు వచ్చిందట.

కాస్త కొత్తగా ఉండే ఏ ప్రాజెక్టుకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నాగార్జునకు అలవాటే. మరీ ముఖ్యంగా మన్మధుడు అనే ట్యాగ్ లైన్ అంటే నాగ్ కు చాలా ఇష్టం. ఆ ట్యాగ్ లైన్ ను కొనసాగిస్తూ… ఒకేసినిమాలో ఐదుగురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడట నాగ్. ఈ మేరకు ఓ డిఫరెంట్ స్టోరీ ఒకటి నాగార్జున వద్దకు వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం నాగార్జున, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ భక్తిరస చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే మూవీపై అతడింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో.. ఓం నమోవేంకటేశాయ చిత్రం పూర్తయిన తర్వాత… ఈ మన్మధుడి లీలలకు సంబంధించిన ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వస్తుంది. అయితే ఈ గమ్మత్తయిన కథను నాగ్ కు వినిపించిన దర్శకుడు ఎవరనేది మాత్రం తెలియడం లేదు.

Loading...

Leave a Reply

*