నిశ్చితార్థం ఇక్కడే… పెళ్లి మాత్రం ఎక్కడో…

akhil

అంతా అనుకున్నట్టే జరిగింది. నాగచైతన్య కూడా ఆ విషయాన్ని ఈమధ్యే చెప్పేశాడు. తనకంటే ముందే తమ్ముడి పెళ్లి జరుగుతుందనే విషయాన్ని చైతూ కన్ ఫర్మ్ చేశాడు. ఇప్పుడు ఆ తేదీ కూడా బయటకొచ్చింది. డిసెంబర్ 9న సాయంత్రం 7 గంటలకు అఖిల్-శ్రియ భూపాల్ ల నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. హైదరాబాద్ లోని జీవీకే ఇంట్లోనే ఈ నిశ్చితార్థం ఉంటుంది. అక్కినేని అఖిల్, శ్రియ భూపాల్ ఒకరికొకరు ఉఁగరాలు మార్చుకునే వేడుక ఇది. అయితే పెళ్లి మాత్రం ఇక్కడ జరగదట.పెళ్లి ఇక్కడ జరగదు అంటే దానర్థం హైదరాబాద్ లో జరగదు అని కాదు.

టోటల్ ఇండియాలోనే ఎక్కడా ఈ పెళ్లి జరగదు. అవును.. అఖిల్ పెళ్లిని విదేశాల్లో ప్లాన్ చేశారు. పెళ్లిని ఒక దేశంలో, రిసెప్షన్ ను ఇంకో దేశంలో ప్లాన్ చేశారు. అఖిల్ నిజానికి ఇండియన్ కాదు. అతడికి అమెరికా పౌరసత్వం ఉంది. కాబట్టి.. సిసింద్రీ పెళ్లి అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. అక్కడ జీవీకే గ్రూప్ కు పెద్ద హోటల్ ఉంది. ఇక రిసెప్షన్ ను ఇటలీలో ప్లాన్ చేస్తున్నారట. అక్కడ కూడా జీవీకేకు పెద్ద స్టార్ హోటల్ ఉంది.ఇండియా నుంచి అతిథులందర్నీ తమ సొంత ఖర్చుతో విమానాల్లో ఇలా దేశాలన్ని తిప్పుతూ… అఖిల్-శ్రియల పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలని జీవీకే అండ్ అక్కినేని ఫ్యామిలీ ఫిక్స్ అయ్యాయట. పెళ్లి ముహూర్తాన్ని త్వరలోనే నిర్ణయిస్తారు.

Loading...

Leave a Reply

*