నాకు అంత సీన్ లేదు – ఒప్పుకున్న నాగచైతన్య

chaitu

ఎప్పుడూ సింపుల్ గా, ఓపెన్ గా ఉండే నాగచైతన్య అంతే ఓపెన్ గా మరో విషయం ఒప్పుకున్నాడు. తనకు అంత సీన్ లేదని అందరి ముందు చెప్పేశాడు. మిగతా హీరోలు ఎవరైనా మాటవరసకు కూడా ఇలా మాట్లాడరు. కానీ నాగచైతన్య మాత్రం తనకు అంత సీన్ లేదని అంగీకరించాడు. ఓ సినిమా రీమేక్ విషయంలో చైతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు.సాహసం శ్వాసగా సాగిపో సినిమా విడుదల సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చైతన్య… హలో బ్రదర్ రీమేక్ గురించి మాట్లాడాడు. ఆ సినిమా రీమేక్ లో నాగచైతన్య నటిస్తాడంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు స్పందించిన చైతూ…

ఆ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నానని.. కాకపోతే.. అందులో నాగార్జున నటించిన రేంజ్ లో తను నటించలేనని ఒప్పుకున్నాడు. తనకు అంత సీన్ లేదు కాబట్టే… హలో బ్రదర్ రీమేక్ ను టచ్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.అయితే నిన్నే పెళ్లాడతా సినిమా గురించి మాత్రం చైతన్య మాట్లాడాడు. నిన్నే పెళ్లాడతా సినిమా రీమేక్ చేసే సాహలం కూడా తను చేయలేనన్నాడు. అయితే ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమాలో మాత్రం నిన్నే పెళ్లాడతా ఛాయలు కనిపిస్తాయంటున్నాడు చైతూ.

Loading...

Leave a Reply

*