నాగ‌శౌర్యకి నంద‌మూరి ఫ్యామిలీకి రిలేష‌న్‌..!

naga-shourya-is-a-close-relative-to-balakrishna

తెలుగు సీనిరంగంలో నాగ‌శౌర్య‌కు పెద్ద బ్యాక్‌గ్రౌండ్ దొరికింది. ఈ న‌వ య‌వ్వ‌న హీరో ఇప్పుడు ఏకంగా నంద‌మూరి వంశానికి ద‌గ్గ‌రి బంధువైపోయారు. నాగ‌శౌర్యకు ఆయ‌న‌ తాజా చిత్రం జో అచ్చుతానంద…. సూప‌ర్‌హిట్‌తో పాటు నంద‌మూరి వంశంతో చుట్ట‌రికాన్ని బ‌య‌ట‌కు తెచ్చింది. ఆ సినిమాలో నారా రోహిత్‌తో క‌లిసి నాగ‌శౌర్య హీరోయిజాన్ని పంచుకున్నారు. ఆ సంద‌ర్భంగానే వీరిమ‌ద్య క‌జిన్ బంధం కూడా బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో ఈ యువ హీరోలిద్ద‌రూ వెల్ల‌డించారు.

ఇక‌, ఈ సినిమాపై నంద‌మూరి బాల‌కృష్ణ కూడా స్పందిస్తూ…. మా అల్లుడి సినిమాను ఘ‌నంగా ఆద‌రించాల‌ని ఫ్యాన్సును కోరారు. ఇందులో నారా రోహిత్ ఎటూ అల్లుడు వ‌ర‌సే అవుతారు కాబ‌ట్టి ఆయ‌న గురించే బాల‌య్య స్పందించారేమో అనుకున్న వాళ్లంతా…. సినిమాలోని మ‌రో హిరో నాగ‌శౌర్య‌ను త‌న అల్లుడి కింద‌నే లెక్కేసి చెప్పిన‌ట్లు తెలిసి తెలుగు సినీ ప్రేక్ష‌కులు విస్మయానికి గుర‌య్యారు. అయితే, నాగ‌శౌర్య‌కు, నంద‌మూరి వంశానికి బంధుత్వంపై లింకు ఎక్క‌డ క‌లిసిందా అని ఆరా తీసిన ఆయ‌న అభిమానులు చివ‌ర‌కు బాల‌య్య చెప్పింది నిజ‌మేన‌ని తేల్చుకున్న‌ట్లు స‌మాచారం.

టీడీపీ నేత‌, గీతం విద్యా సంస్థ‌లకు చెందిన ఎంవీఎస్ఎస్ మూర్తి ఉన్నారు క‌దా ఆయ‌న కుటుంబానికి ద‌గ్గ‌రి బంధువ‌ట నాగ‌శౌర్య. ఈ ఎంవీఎస్ఎస్ మూర్తి మ‌నవ‌డికే బాల‌కృష్ణ రెండో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసిన సంగ‌తి విధిత‌మే. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డో ఉన్న నాగ‌శౌర్య‌కు సినీ రంగాన్ని ఏలుతున్న బాల‌య్య‌కు బంధుత్వంలో లింకు కుదిరింద‌ని స‌మాచారం. ఆ క్ర‌మంలోనే జ్యో అచ్యుతానంద‌ సినిమా షూటింగ్‌లో ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్… ఇద్ద‌రు హీరోలు నారా రోహిత్‌, నాగ‌శౌర్య‌ల బంధుత్వాన్ని గుర్తు చేశార‌ట‌. అప్పుడే వీరిద్ద‌రికీ కూడా తాము క‌జిన్స్ అవుతామ‌ని తెలిసింద‌ని ఈ యువ హీరోలే ఇటీవ‌ల మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు, నాగ‌శౌర్య తొలి సినిమా ఊహ‌లు గుస‌గుస‌లాడేని కూడా బాల‌య్య స్పెష‌ల్ షో చూసి, నాగశౌర్య‌ని ఆశీర్వ‌దించారు. అంటే, బాల‌య్య చిన్న అల్లుడుకి, నాగ‌శౌర్యకి బంధుత్వమే బాల‌య్య‌ను కూడా ద‌గ్గ‌ర చేసింద‌న్న‌మాట‌..!

Loading...

Leave a Reply

*