సౌత్ ఇండియాలో ఫ‌స్ట్ కార్ ఇదేన‌ట‌.. నీహారిక హీరో సూప‌ర్ అబ్బా..!

niharika

నీహారిక హీరో అంటే ఎవ‌ర‌నుకుంటున్నారు…? అవును మీ అంచ‌నా క‌రెక్టే.. నాగ‌శౌర్య. మెగా డాట‌ర్ బిగ్ స్క్రీన్‌పై నటించిన తొలి సినిమా ఒక మ‌న‌సు. ఈ సినిమాలో హీరోగా నాగ‌శౌర్య న‌టించాడు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ చిత్రం ఆశించిన రేంజ్‌లో ఆడ‌లేదు. కానీ, ఆమెను న‌టిగా ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు రామ‌రాజు స‌క్సెస్ అయ్యాడు. ప్ర‌స్తుతం సెకండ్ మూవీ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తోంది మెగా డాట‌ర్‌.

నాగ‌శౌర్య ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమా త‌ర్వాత ఆయ‌న‌కు స‌రైన బ్రేక్ రాలేదు. రెండు సినిమాల‌తో ఈ ఏడాది త‌న ఫేట్ మార్చుకున్నాడు. క‌ల్యాణ వైభోగ‌మేతోపాటు జ్యో అచ్యుతానందతో ఈ రొమాంటిక్ హీరోకి మంచి విజ‌యాలు పొందాడు. దీంతో, ఆయ‌న ఫేట్ మారింది. అయితే, ప్ర‌స్తుతం ఈ యువ హీరో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇదో ప్ర‌యోగాత్మ‌క చిత్రం. ఈ సినిమా కోసం నాగ‌శౌర్య గ‌డ్డం పెంచి న్యూ గెట‌ప్‌లోకి మారిపోయాడు.

నాగ‌శౌర్య ప్రెజెంట్‌…. ఓ కారు కొన్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న పోష్ కారును వ‌దిలేసి.. మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కొన్నాడు. దాని డెలివ‌రీ అయిపోయింది. త‌న‌కు ల‌క్కీ నెంబ‌ర్ 9. అందుకే, ఈ నెల 27న ఆ కారును డెలివ‌రీ కూడా తీసుకున్నాడట‌. కోటి ప‌దిలక్ష‌ల రూపాయ‌ల‌తో కొన్న ఈ మోడ‌ల్ కారు సౌత్ ఇండియాలో ఫ‌స్ట్ ఇదేన‌ట‌. నాగ‌శౌర్య హీరో కాక‌ముందే ఫుల్ సౌండ్ పార్టీ. అందుకే, ఆ రేంజ్‌లో కారు కొన్నాడ‌ట‌. ఏదయినా, ఆ కారు సూప‌ర్ అంటున్నారు చూసిన జ‌నాలు.

Loading...

Leave a Reply

*