ప్రేమ‌మ్ సెన్సార్ టాక్‌.. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గ్యారంటీ..!

premam

రీసెంట్‌గా టాలీవుడ్‌లో అంద‌రూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ప్రేమ‌మ్‌. అక్కినేని యువ హీరో చైతు కెరీర్‌లో ఈ సినిమాకి వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రో సినిమాకి రాలేదు. టాలీవుడ్‌లో ఫుల్ లెంగ్త్ ప్రేమ‌క‌థ‌లు, రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌లు త‌గ్గిపోయాయి అనుకుంటున్న టైమ్‌లో.. ప్రేమ‌మ్ మూవీ యూత్‌ఫుల్ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్కింది. కాసేప‌టి క్రితం సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న రిలీజ్ కానుంది.క‌థ విష‌యానికి వ‌స్తే.. ఇది ఓ యువ‌కుడి ప్రేమ‌క‌థ‌. టీనేజ్ వ‌య‌సు నుంచి మ్యారేజ్ వ‌య‌సుదాకా ఓ యువ‌కుడి ప్ర‌యాణంలో సాగిన ప్రేమ‌క‌థ‌ల స‌మాహార‌మే ప్రేమ‌మ్‌. ఈ సినిమాలో నాగచైత‌న్య మూడు డిఫ‌రెంట్ కేర‌క్ట‌ర్‌ల‌లో క‌నిపిస్తాడు. టీనేజ్ యువ‌కుడిగా, కాలేజ్ ల‌వ‌ర్‌బోయ్‌గా, ఆ త‌ర్వాత‌.. ఒక ఉద్యోగిగా.. ఇలా మూడు డిఫరెంట్ వేరియేష‌న్స్‌లో చైతు చాలా చ‌క్క‌గా న‌టించాడ‌ని సెన్సార్ బోర్డ్ స‌భ్యులు అభిప్రాయ ప‌డుతున్నారు.

రీసెంట్‌గా ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ యూత్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్ రిలీజ్ కాలేద‌నే టాక్ వినిపిస్తోంది.ఫ‌స్ట్ హాఫ్‌లో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌తోపాటు టీనేజ్ ల‌వ్ బాగా ఎలివేట్ అవుతుంద‌ట‌. ఆ త‌ర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్ స‌న్నివేశాలు కూడా మ‌న‌సుకు హ‌త్తుకుంటాయని చెబుతున్నారు. సినిమా క్ల‌యిమాక్స్‌లో హీరో ఎవ‌రిని పెళ్లాడ‌తాడు అనేది స్టోరీ. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్‌లు. అయితే, ఇంట‌ర్‌వెల్ త‌ర్వాత శృతి హాస‌న్ ఎంట్రీ ఇస్తుంది. శృతి-చైతు రిలేష‌న్‌తో వ‌చ్చే సీన్‌లు సినిమాకి జీవం పోశాయని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చెబుతున్నారు. క్ల‌యిమాక్స్‌లో శృతిహాసన్‌-చైతు మ‌ధ్య వ‌చ్చే సీన్‌లు ప్రేమ‌మ్ రేంజ్‌ని పెంచుతాయ‌ని భావిస్తోంది సినిమా యూనిట్‌. ప్ర‌తి ఒక్క‌రూ చైతులోని మూడు డిఫ‌రెంట్ పాత్ర‌ల‌లో ఒక‌దానికి ఈజీగా ఐడింటిఫై అవుతార‌ని, సినిమా స‌క్సెస్‌కి అదే హెల్ప్ అవుతుంద‌ని కాన్‌ఫిడెంట్‌గా ఉంది సినిమా యూనిట్‌.మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, శృతిహాస‌న్‌..

ఈ ముగ్గురి గ్లామ‌ర్ సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది. ముగ్గురిని ఎంతో అందంగా ప్రెజెంట్ చేశాడట‌ ద‌ర్శ‌కుడు చందూ మొండేటి. భాగ్య‌ల‌క్ష్మి ఇంత‌వ‌ర‌కు కెరీర్‌లో ఈ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌లేద‌ట‌. ప్రేమ‌లోని సున్నిత‌త్వం, విర‌హంతో పాటు అన్ని కోణాల‌ను ద‌ర్శ‌కుడు చందూ మొండేటి అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ట‌. తొలి చిత్రం కార్తికేయ‌తో ఓ వైవిధ్య‌మైన జాన‌ర్‌ని అందించిన చందూ.. రెండో మూవీని అంత‌కంటే కొత్త‌గా ఆవిష్క‌రించాడు. రీమేక్ క‌థే అయినా పూర్తి తెలుగు నేటివిటీతో తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు మొండేటి. మూల‌క‌థ‌కి ఏ మాత్రం సంబంధం లేకుండా ప్ర‌తి సీన్‌ని కొత్త‌గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు చందూ. ఈ మూవీ చూసి నాగ్‌.. చైతు కెరీర్‌లో గీతాంజ‌లి అవుతుంద‌ని చెప్పాడు.అంటే సినిమా ఓ క్లాసిక్‌గా నిల‌వ‌డం గ్యారంటీ అన్న‌మాట‌. మొత్త‌మ్మీద‌, సెన్సార్ టాక్‌తో ప్రేమ‌మ్ రేంజ్ మ‌రింత పెరుగుతుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

Loading...

Leave a Reply

*