ప్రేమ‌మ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు..!

nag

ద‌స‌రా రేస్‌లో అయిదు సినిమాలు విడుద‌ల‌య్యాయి. అందులో అంద‌రి ఫోక‌స్ చైత‌న్య ప్రేమ‌మ్‌పైనే. ఈ వీకెండ్ కానుక‌గా విడుద‌ల‌యింది ప్రేమ‌మ్‌. ఈ సినిమాకి అన్ని సెంట‌ర్‌ల‌లోనూ పాజిటివ్ టాక్ వ‌చ్చింది. నాగచైత‌న్య న‌ట‌న‌, ముగ్గురు హీరోయిన్‌ల గ్లామ‌ర్‌కి చందూ మొండేటి దర్శ‌క‌త్వ ప్ర‌తిభ కూడా యాడ్ అయ్యాయి. దీంతో, సినిమా రేంజ్ పెరిగింది. తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది ప్రేమమ్‌. ద‌స‌రా బ‌రిలో యునానిమ‌స్ స‌క్సెస్‌ని ద‌క్కించుకున్న మూవీ ఇది ఒక్క‌టే. అయితే, ఈ సినిమా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..ప్రేమ‌మ్ తొలి రోజు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌లో క‌లిపి 3 కోట్లు ద‌క్కించుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇటు ఓవ‌ర్సీస్‌లో ల‌క్ష డాల‌ర్‌ల‌ను పొందింది ప్రీమియ‌ర్ షోల‌తో. చైతు సినిమాల‌లో ఇదే అది పెద్ద హిట్‌. ఓపెనింగ్ రోజే భారీగా రెస్పాన్స్ రావ‌డంతో ముందు ముందు వ‌సూళ్లు పెరిగే చాన్స్ ఉంది. వీకెండ్‌తోపాటు మంగ‌ళ‌వారం ద‌స‌రా పండ‌గ‌. అంటే అయిదు రోజుల లాంగ్ వీకెండ్‌. ఇలా, వ‌ర‌స సెల‌వులు రావ‌డంతో ప్రేమ‌మ్ చైతు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.ప్రేమ‌మ్ స‌క్సెస్‌పై ఇప్ప‌టికే స‌మంత ఫుల్ హ్యాపీగా ఉంది. ఇటు, నాగార్జున కూడా ట్వీట్స్‌తో త‌న వారసుడి విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్నాన‌ని తెలిపాడు. ఇలా, అక్కినేని కుటుంబంలో ద‌స‌రా సంబ‌రాలు మొద‌ల‌య్యాయి.

Loading...

Leave a Reply

*