చైతూ కూడా అక్కడికే వెళ్తాడట…

unnamed

ప్రస్తుతం తెలుగు హీరోలంతా తమిళ మార్కెట్ పై కన్నేశారు. మురుగదాస్ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. బన్నీ అయితే ఏకంగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక నిన్నగాక మొన్న సందీప్ కిషన్.. ఏకంగా తెలుగు-తమిళ భాషల్లో కొత్త సినిమా ప్రారంభించాడు. అటు ప్రభాస్ కూడా బాహుబలి-2 తర్వాత తన ప్రతి సినిమాను తెలుగు-తమిళ భాషల్లో ప్లాన్ చేస్తున్నాడు. దీంతో నాగచైతన్య కూడా కోలీవుడ్ డ్రీమ్స్ కంటున్నాడు.

కుదిరితే వచ్చే ఏడాది తమిళ్ లో ఓ సినిమా చేస్తానంటున్నాడు చైతూ. నిజానికి సాహసం శ్వాసగా సాగిపో సినిమాతోనే కోలీవుడ్ కు వెళ్లాలనుకున్నాడ ఈ అక్కినేని యువసామ్రాట్. ఆ విషయాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ కు కూడా చెప్పాడట.అయితే అప్పటికే చైతూకు చెప్పకుండా గౌతమ్ మీనన్ తమిళ వర్షన్ షూటింగ్ ప్రారంభించేశాడు. శింబు-మంజిమా మోహన్ జంటగా కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేశాడు. దీంతో నెక్ట్స్ టైం బెటర్ లక్ అనుకున్నాడు నాగచైతన్య.

మొన్నటివరకు తమిళ హీరోలే తెలుగుతెరపైకి ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు మన స్టార్ హీరోలు కూడా తమిళతెరపైకి దూసుకుకోవడానికి, కుదిరితే తమిళ తెరలు చించేయడానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఇక్కడ సూర్య, విక్రమ్ క్లిక్ అయినట్టు… అక్కడ మనోళ్లు ఎవరు క్లిక్ అవుతారనేది పెద్ద డౌట్.

Loading...

Leave a Reply

*