స‌మంత‌కి చైతు సూప‌ర్ గిఫ్ట్… జీవితంలో ఎప్ప‌టికీ మ‌రిచిపోలేద‌ట‌..!

untitled-22

స‌మంత‌-నాగ‌చైత‌న్య‌.. టాలీవుడ్ హాట్ ల‌వ్ క‌పుల్‌. కాబోయే వ‌ధూవ‌రులు. పెళ్లికి రెడీ.. కానీ, ముహూర్తానికి టైమ్ ఉందంటూ ప్రేమ‌మ్‌ని ఎంజాయ్ చేస్తోంది ఈ కాబోయే క‌పుల్‌. ఇద్ద‌రి కెరీర్ దాదాపు ఒకే టైమ్‌లో షురూ అయింది. అయితే, స‌మంత టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ వ‌ర‌స విజ‌యాల‌తో ల‌క్కీ మ‌స్క‌ట్‌గా మారింది. గోల్డెన్ గాళ్ అనిపించుకుంది. స‌క్సెస్‌తోపాటు కెరీర్ గ్రాఫ్‌ని కూడా కంపేర్ చేస్తే చైతుకంటే స‌మంత‌నే టాప్ పొజిష‌న్‌లో ఉంది. తిరుగులేని విజ‌యాల‌తో సౌత్‌లో బ‌డా హీరోయిన్‌గా ఎదిగితే.. చైతు ఇప్ప‌టికీ స్టార్‌డ‌మ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రేమ‌మ్‌తో ఆయ‌న ప‌ర్లేద‌నిపించాడు. రీసెంట్‌గా విడుద‌ల‌యిన ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను పొందుతోంది. ద‌స‌రా రేస్‌లో విన్న‌ర్‌గా నిలిచింది.

అయితే, పెళ్లికి ముందు స‌మంత‌.. చైతుకి ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాల‌ని భావించాడ‌ట‌. ఇటు, స‌మంత కూడా చాలా కాలంగా ఆ గిఫ్ట్ కోస‌మే వెయిట్ చేస్తున్నాను అని తెలిపింద‌ట‌. ద‌స‌రా కానుక‌గా ఆమెకు ఆ బ‌హుమ‌తి కూడా ఇచ్చేశాడ‌ట‌. అంతే, అది చూసిన చైతుకి స‌మంత థ్యాంక్స్ చెప్ప‌డంతోపాటు.. దానిని జీవితాంతం మ‌రిచిపోన‌ని కూడా తెలిపింద‌ట‌.

ఇంత‌కీ ఏంటి ఆ బ‌హుమ‌తి ఏంట‌నుకుంటున్నారా? సినిమా స‌క్సెస్. అవును, వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన మ‌నం త‌ర్వాత చైతుకి చెప్పుకోద‌గ్గ విజ‌యం లేదు. ఆ త‌ర్వాత ఒక లైలా కోసం, దోచేయ్ వంటి చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అందులో ఒక లైలా కోసం యావ‌రేజ్ అనిపిస్తే.. దోచేయ్‌ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాకొట్టింది. దీంతో, మ్యారేజ్‌కి ముందు చైతుని స‌క్సెస్ ఫుల్ హీరోగా చూడాల‌ని కోరుకుంద‌ట స‌మంత‌. అదే విష‌యాన్ని త‌న ఫియాన్సీ చైతుకి కూడా తెలిపింద‌ట‌. అయితే, ప్రేమమ్‌తో నీకు మ‌రిచిపోలేని బ‌హుమ‌తి ఇస్తాన‌ని మాటిచ్చిన చైతు.. మాట త‌ప్ప‌కుండా ఆ బ‌హుమ‌తిని స‌క్సెస్ రూపంలో చుల్‌బులీకి ఇచ్చాడ‌ట‌. న‌టుడిగానూ అక్కినేని వార‌సుడు ఎంతో మెచ్యూరిటీ ప్ర‌ద‌ర్శించాడు. క్రిటిక్స్‌తోనూ ప్ర‌శంస‌లు పొందాడు. అంతే, ఎగిరిగంతేసింది స‌మంత‌. తొలి రోజే సినిమా రివ్యూలు చూసి ఆమె ట్వీట్స్‌తోనే సంబ‌రాలు చేసుకుంది.

ప్రేమ‌మ్ స‌క్సెస్‌తో సంబ‌రాలు చేసుకుంది ఈ జంట‌. ఇటీవ‌ల ఓ ప‌బ్‌లో స‌మంత‌-చైతు క‌లిసి ఎంజాయ్ చేస్తూ క‌నిపించిన వీడియో అదేన‌ట‌. ఇలా, ప్రేమ‌మ్‌తో లైఫ్‌లో స‌మంత‌కి మార్వెలెస్ గిఫ్ట్ ఇచ్చాడ‌ని చెప్పుకుంటోంద‌ట చుల్‌బులీ.

Loading...

Leave a Reply

*