ఇజం హైలైట్స్ ఇవే.. ఆ సీన్‌లు కెవ్వు కేక‌…..!

untitled-1

క‌ల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ఇజం. పూరి జ‌గ‌న్నాధ్ వంటి సంచ‌ల‌న, బ‌డా ద‌ర్శ‌కుడితో ఈ నంద‌మూరి హీరో న‌టించ‌డం ఇదే తొలిసారి. ఆయ‌న కెరీర్‌లో భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన మూవీ కూడా ఇదే. ఇజం స్టిల్స్‌తోపాటు రీసెంట్‌గా విడుద‌ల చేస్తున్న పోస్ట‌ర్స్‌తో సినిమాపై అంచ‌నాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

జ‌ర్న‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో.. ప‌నామా లీక్స్‌, వికీ లీక్స్ వంటి సంచ‌ల‌న క‌థ‌నంతో తెరకెక్కింద‌ట‌. హీరో జ‌ర్న‌లిస్ట్‌గానే కాకుండా.. వికీ లీక్స్ అసాంజేలా ప‌నిచేస్తాడ‌ని, ప్ర‌పంచంలోని ముఖ్యంగా ఇండియాతోపాటు తెలుగు రాష్ట్రాల‌లోని బ్లాక్ మ‌నీ బ‌డా బాబుల లిస్ట్‌ను లీక్ చేస్తాడ‌ట‌. ప్ర‌తి ఒక్క‌రి లిస్ట్‌ని జ‌ర్న‌లిస్ట్‌లు ఎలా సేక‌రిస్తారు..? ఎలా వాటిని లీక్ చేస్తారు..? అనేది క్లియ‌ర్‌గా చూపించాడ‌ట పూరి. ప్ర‌పంచంలోని బ‌డా బాబులంతా త‌మ బ్లాక్ మ‌నీని ఎక్క‌డ దాచిపెడ‌తారో కూడా ప్రెజెంట్ చేశాడ‌ట జ‌గ‌న్‌.

క‌ల్యాణ్ రామ్ కేర‌క్ట‌ర్ ఇంత‌వ‌ర‌కు ఏ సినిమాలో చెయ్య‌ని విధంగా ఉంటుంద‌ని స‌మాచారం. సిక్స్ ప్యాక్ బాడీ, మోడ‌ర్న్ లుక్స్‌తోపాటు బాడీ లాంగ్వేజ్ కూడా వైవిధ్యంగా చేశాడ‌ట‌. మేకోవ‌ర్‌లో టెంప‌ర్‌లో తార‌క్ ఎలా క‌నిపించాడో.. అంత‌కంటే డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తాడ‌ట క‌ల్యాణ్‌రామ్ ఈ సినిమాలో. ఇక‌, జ‌గ‌ప‌తిబాబు రోల్ సినిమాకి మ‌రో అడ్వాంటేజ్ అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇజంలో ఆయ‌న కొత్త‌గా క‌నిపిస్తార‌ట‌. లుక్స్‌లో కూడా.

ఇక, సొసైటీ, మీడియాతో పాటు బ్లాక్ మ‌నీ బ‌డా బాబులపై పూరి రాసిన డైలాగ్‌లు బాగా పేలుతాయ‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు, సినిమాకి చివ‌రి 20 నిమిషాలు కీల‌క‌మ‌ట‌. ఇక‌, టెంప‌ర్‌లో ఉన్న‌ట్లే ఇజంలోనూ కోర్ట్ సీన్ ఉంటుంది. దాదాపు 5-7నిమిషాల లెంగ్త్ ఉన్న ఈ కోర్ట్ సీన్‌.. సినిమాకి హైలైట్ అవుతుంద‌ట‌. రిపీటెడ్ ఆడియెన్స్‌ని తెప్పించే సీన్ ఇదేన‌ని, కోర్ట్ సీన్‌లోని ప్ర‌తి డైలాగ్ పేలుతుంద‌ని, అంత‌గా పూరి కేర్ తీసుకున్నాడ‌ట. మొత్త‌మ్మీద‌, సినిమా అదిరిపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

 

Loading...

Leave a Reply

*