చెర్రీ విషయంలో వెనక్కి తగ్గిన భారీ బ్యానర్

untitled-47

రామ్ చరణ్ తో త్వరలోనే ఓ సినిమా నిర్మించబోతోంది ఆ బ్యానర్. సుకుమార్-చెర్రీ కాంబినేషన్ ను వర్కవుట్ చేసింది ఆ బ్యానరే. అదే మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే జనతా గ్యారేజ్ లాంటి పలు సూపర్ హిట్ చిత్రాల్ని అందించిన ఈ బ్యానర్… ఇప్పుడు చెర్రీకి సంబంధించిన తాజా ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గింది. అవును.. చెర్రీ నటిస్తున్న ధృవ సినిమా అమెరికా హక్కుల్ని మైత్రీ మూవీస్ బ్యానర్ దక్కించుకుంది. అయితే ఇప్పుడా డీల్ నుంచి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

ధృవ సినిమాకు సంబంధించి అమెరికా హక్కుల్ని 5కోట్ల 25లక్షల రూపాయలకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దక్కించుకుంది. అయితే ఓవర్సీస్ లో చెర్రీకి అంత మార్కెట్ లేదు. ఇప్పటివరకు తన స్టామినాను చూపించే సినిమాను ఓవర్సీస్ లో విడుదల చేయలేదు చరణ్. అందుకే ధృవతో రిస్క్ తో చేస్తున్నామేమో అనే ఫీలింగ్ కు వచ్చారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. అందుకే ఉన్నఫలంగా ఈ హక్కులన్నింటినీ మరో డిస్ట్రిబ్యూటర్ కు అమ్మేశారు.

అలా చెర్రీ సినిమా నుంచి పూర్తిగా తప్పుకుంది మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. చరణ్ కు సంబంధించి కేవలం ఒక్క ఏరియా విషయంలోనే ఈ నిర్మాతలు ఇంతలా ఆలోచిస్తుంటే… త్వరలోనే ఏకంగా చరణ్ తో సినిమా చేస్తున్న ఈ నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఇంకెంత ఆలోచిస్తారా అని అంతా లెక్కలేసుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*