మరోసారి తెరపైకి మొనగాడు…

untitled-2

ఇదేంటి మొనగాడు తెరపైకి రావడం ఏంటని ఆలోచిస్తున్నారా… అసలు మహేష్ బాబును మొనగాడు అని ఎందుకంటున్నాం అని థింక్ చేస్తున్నారా…. ఇందులో పెద్దగా ఆలోచించడానికేం లేదు. మొనగాడు అనే టైటిల్ కు మహేష్ బాబుకు చాలా దగ్గర సంబంధం ఉంది. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ తో ఖలేజా చేస్తున్న టైమ్ నుంచి ఈ టైటిల్ మహేష్ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది.

త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న టైమ్ లో ఖలేజా అనే టైటిల్ పిక్స్ చేయకముందే మొనగాడు అనే టైటిలే చక్కర్లు కొట్టింది. కానీ అప్పుడది ఫిక్స్ అవ్వలేదు. ఆ తర్వాత సుకుమార్, పూరీ జగన్నాధ్ సినిమాలప్పుడు కూడా ఇదే పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ అప్పుడు కూడా ఈ టైటిల్ అనాథగానే మిగిలిపోయింది. ఇప్పుడు మురుగదాస్ సినిమా కోసం మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది ఈ టైటిల్.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ఏజెంట్ శివ లాంటి పేర్లు పరిశీలిస్తున్నప్పటికీ… మొనగాడు అనే టైటిల్ కూడా తాజాగా రేసులోకి వచ్చింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు మొనగాడు అనే పేరు పెడితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. అటు మహేష్ కూడా ఈ టైటిల్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.

Loading...

Leave a Reply

*