మొండేటిని నాగార్జున వదులుకుంటాడా…

untitled-810

టాలెంట్ ను ఎప్పుడూ మిస్ చేసుకోడు నాగ్. కుదిరితే తన అన్నపూర్ణ స్టుడియోలోనే కట్టిపడేస్తాడు. ఎప్పుడూ నాగార్జునది ఇదే దారి. అయితే ఈమధ్య కాలంలో ఓ చిన్న తప్పు చేశాడు మన్మధుడు. టాలెంట్ ఉందని తెలిసి కూడా విక్రమ్ కుమార్ ను వదిలేసుకున్నాడు. తిరిగి అతడ్ని తన గూటికి తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు చందు మొండేటి విషయంలో ఏం చేయబోతున్నాడు…

సోగ్గాడే చిన్ని నాయనా హిట్ అయిన వెంటనే కల్యాణ్ కృష్ణను లాక్ చేసిపడేశాడు నాగ్. ఇప్పుడే కాదు.. మరో రెండేళ్ల పాటు కల్యాణ్.. అక్కినేని హీరోలతోనే సినిమాలు చేస్తాడు. మరి చందు మొండేటి పరిస్థితేంటి. ప్రేమమ్ తో నాగచైతన్యకు కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అందించాడు. మరి ఈ హీరోను నాగార్జున లాక్ చేస్తాడా… ఏమాత్రం ఆలస్యం చేసినా మొండేటి అక్కినేనికి దొరకడు.

ఎందుకంటే.. ఇప్పటికే చందు మొండేటి మెగా హీరో కోసం ఓ కథ రాసుకున్నాడు. షార్ట్ టెర్మ్ మెమొరీ లాస్ కథతో వరుణ్ తేజ హీరోగా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. సేమ్ టైం, నాగార్జున కోసం కూడా మరో కథ రాసుకున్నాడు. అయితే ఇప్పుడు మొండేటిని మెగా హీరోలు దక్కించుకుంటారా లేక నాగార్జునే తన కోటరీలో కొనసాగేలా చేసుకుంటాడా అనేది తేలాల్సి ఉంది.

Loading...

Leave a Reply

*