దీపావ‌ళి కోసం చీక‌టిని చేధించుకువ‌చ్చిన చిరంజీవి..!

untitled-6

చిరంజీవి రీ ఎంట్రీలో ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్ న‌టిస్తున్న తొలి మూవీ ఖైదీ నెంబ‌ర్ 150. గ‌తేడాది ఆయ‌న బ్రూస్‌లీలో న‌టించినా అది కేవ‌లం గెస్ట్ రోల్‌. హీరోగా ఆయ‌న‌కు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. రెండు స్టిల్స్‌ని విడుద‌ల చేశారు.

గ‌తంలో సినిమా పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసినా.. అందులో చిరంజీవి చీక‌టిలో ఉన్నాడు. కానీ, ఆయ‌న ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చాడు. ఈ లుక్ ప‌ర్లేద‌నిపిస్తోంది. చిరంజీవి ఒక లుక్‌లో లావుగా క‌నిపిస్తున్నా.. మ‌రో పోస్ట‌ర్‌లో లీన్‌గా క‌నిపిస్తున్నాడు. టోట‌ల్‌గా చిరంజీవి రీ ఎంట్రీలో ఫ్యాన్స్‌కు పండ‌గ చేస్తున్నాడు. చిరు లుక్‌తో మెగాభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు.

Loading...

Leave a Reply

*