మెగాస్టార్ తో మెగా నిర్మాత…

untitled-7

ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆ బ్యానర్. కానీ ఇప్పుడు మాత్రం ఆ బ్యానర్ పై సినిమా చేయడానికే అంతా వెనకడుగు వేస్తున్నారు. ఆ నిర్మాత కూడా ఖర్చు ఎక్కువ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ బ్యానర్ పేరే వైజయంతీ మూవీస్. ఇక ఆ నిర్మాత పేరు అశ్వనీదత్. అవును.. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న అశ్వనీదత్ ఇప్పుడు చిరంజీవి రీఎంట్రీ తో జోష్ లోకి వచ్చేశారు. కుదిరితే మెగాస్టార్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చిరంజీవి హీరోగానే వచ్చాయి. అందుకే ఈసారి కూడా తన బ్యానర్ పై చిరంజీవి హీరోగానే సినిమా చేయాలని అశ్వనీదత్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న చిరంజీవి 151 వ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించాలని అశ్వనీదత్ అనుకుంటున్నారట. ఈ మేరకు మెగామాస్టర్ బ్రెయిన్ అల్లు అరవింద్ తో అశ్వనీదత్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఒకప్పుడు అశ్వనీదత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు అదో క్రేజ్. భారీతనానికి చిరునామాగా అయన సినిమాలు ఉండేవి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు తీశారు అశ్వనీదత్. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న ఈ మెగా ప్రొడ్యూసర్… మెగాస్టార్ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు అశ్వనీదత్ తో పాటు అల్లు అరవింద్ కూడా నిర్మిస్తారనే టాక్ వినిపిస్తోంది.

Loading...

Leave a Reply

*