బాహుబ‌లి 2 టీజ‌ర్ చూసిన చిరంజీవి.. షాక్ అయ్యాడ‌ట‌..!

untitled-9

నిన్న బాహుబలి సెట్స్‌ను మెగాస్టార్‌ చిరంజీవి సందర్శించారు. అనుకోని అతిథిని చూసి బాహుబలి అవాక్కయ్యాడు. వెంటనే వెళ్లి మెగాస్టార్ ను కౌగిలించుకున్నాడు. ఒక్కసారిగా ఖైదీ గెటప్ లో చిరంజీవిని చూసిన బాహుబలి టీం ఆశ్చర్యంలో మునిగిపోయింది. చిరంజీవికి ఘనస్వాగతం పలికింది. రాజమౌళి, ప్రభాస్ తో పాటు టోటల్ యూనిట్ అంతా చిరును చూసి పులకించిపోయింది. ఇదిలా ఉండగా… ప్రభాస్ కు అందరికంటే ముందే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వ్యక్తి గా మారాడు చిరంజీవి.

రేపు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బాహుబలి సెట్స్ ను సందర్శించి, ప్రభాస్ కు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్.ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకి రాజ‌మౌళి భారీ గిఫ్ట్ రెడీ చేశాడు. బాహుబ‌లి 2ని టీజ‌ర్‌ని ఆయ‌న బ‌ర్త్ డే కానుక‌గా రిలీజ్ చెయ్య‌నున్నాడు. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు జ‌క్క‌న్న‌. ఇవాళ 4 గంట‌ల‌కు టీజ‌ర్ రానుంది. అయితే, ఈ సినిమా టీజ‌ర్‌ని మొద‌ట చూసింది చిరంజీవి అట‌.

బాహుబ‌లి సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌కు రాజ‌మౌళి టీజ‌ర్‌ని చూపించాడ‌ని, అది అదిరిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది.చిరంజీవి కూడా బాహుబ‌లి 2 టీజ‌ర్ చూసి షాక్ అయ్యాడ‌ట‌. బాహుబ‌లి కంటే ఈ సినిమా రిచ్‌గా ఉంద‌ని, అంత‌కుమించి హిట్ అవుతుంద‌ని చిరు కాన్‌ఫిడెంట్‌గా చెప్పాడ‌ట రాజ‌మౌళికి. మెగాస్టార్ ప్ర‌శంస‌ల‌కి జ‌క్క‌న్న కూడా పుల‌కించిపోయాడ‌ట‌. ఇవాళ ఈవెనింగ్ బాహుబలి 2 టీజ‌ర్ రానుంది. మరి, ఇది ఎలాంటి సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*