మెగా కాంపౌండ్ లో రణబీర్ కపూర్…

mega

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టడం లేదు. మెగా కాంపౌండ్ లోనే ఓ హీరో రణబీర్ కపూర్ లా మారిపోయాడు. ఇప్పటివరకు ఈ కాంపౌండ్ హీరోలంతా సినిమాలతోనే హల్ చల్ చేశారు. కానీ ఫస్ట్ టైం సాయిధరమ్ తేజ మాత్రం ఎఫైర్లతో హల్ చల్ చేస్తున్నాడు. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగుపెట్టాడో కానీ… తేజూ చుట్టూ లవ్ ఎఫైర్లు నిత్యం వైఫైలా హల్ చల్ చేస్తూనే ఉంటాయి. ఈమధ్య రెజీనా-తేజూ మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ రూమర్లు వచ్చాయి.

ఆ రూమర్లు చాలా రోజులు పరిశ్రమలో కొనసాగాయి. కానీ తాజాగా రెజీనా, తేజూ ఇద్దరూ వాటిపై క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేం లేదంటూ కొట్టిపడేశారు. అయితే ఇప్పుడు తేజూ మరో అమ్మాయికి బాగా దగ్గరవుతున్నాడని అంటున్నారు. కంచె సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైశ్వాల్ కు తేజూ బాగా క్లోజ్ అయిపోయాడట. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయలేదు. కానీ నక్షత్రం సినిమాతో కనెక్ట్ అయ్యారు. ి

కృష్ణవంశీ డైరక్షన్ లో వస్తున్న నక్షత్రం సినిమాలో తేజు, ప్రగ్యా గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైనే వీళ్లిద్దరూ కలిశారని, బాగా క్లోజ్ అయిపోయారని… ప్రస్తుతం ఈవెనింగ్ పార్టీల్లో ఈ జంటే ఎక్కువగా కనిపిస్తోందని చాలమంది చెవులు కొరుక్కుంటున్నారు. మరి దీనిపై తేజు ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Loading...

Leave a Reply

*