ఖైదీ వ‌ర్సెస్ శాత‌క‌ర్ణి – వేడెక్కుతున్న పోస్ట‌ర్ వార్‌

khaidhi-vs-sathakrni

అభిమానుల పోస్ట‌ర్ వార్ హ‌ద్దులు దాటుతోంది…. పూర్వం అభిమానులు తమ యాంటీ హీరో పోస్ట‌ర్‌పై పేడ కొట్టేవాళ్లు… ఆ పోస్ట‌ర్ల‌ను చించేసే వాళ్లు… ఇప్పుడు అది రూపం మార్చుకుని సోష‌ల్‌ మీడియాకు పాకింది… కామెంట్లు సెటైర్ల పేరుతో ఫ్యాన్స్ పోస్ట‌ర్‌వార్‌ని మళ్లీ షురూ చేశారు…తాజాగా మెగా, నంద‌మూరి అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా రెచ్చిపోతున్నారు.. వాళ్ల పోస్ట‌ర్ వార్ అంద‌రిని బేజారెత్తిస్తోంది… కౌంట‌ర్లు ఎన్‌కౌంట‌ర్ల‌తో ఫ్యాన్స్ తెగ రెచ్చిపోతున్నారు… సంక్రాంతికి చిరంజీవి, బాల‌య్య‌ల మ‌ధ్య వార్ డిసైడ్ కావ‌డంతో దాన్ని వ‌న్‌సైడ్ చేయ‌డానికి అభిమాన సంఘాలు మోహ‌రించాయి… ఈ హీరోల అభిమానులు ఒక‌రినొక‌రు టార్గెట్ చేసుకుంటూ కామెంట్స్ పెట్టుకుంటు న్నారు..

ఈ ఘాటు కామెంట్లు కాక రేపుతున్నాయి.. సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి… ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ కొద్ది గంట‌ల తేడాతో విడుద‌ల కావ‌డంతో ఈ వార్ మ‌రింత ఊపందుకుంది.. వారియర్ లుక్‌లో ఉన్న బాల‌య్య లుక్‌ను విశ్వ‌రూపంగా అభివ‌ర్ణిస్తూ నంద‌మూరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు..దీనికి కౌంట‌ర్‌గా చిరంజీవి మెగా డ్యాన్స్ స్కిల్స్ చూడండంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు… ఫ‌స్ట్‌లుక్ షేర్ చేస్తూ స‌వాల్ విసురుతున్నారు… దీనికి కౌంట‌ర్ ఇస్తున్నారు బాల‌య్య అభిమానులు..

ప‌ర‌భాషా సినిమాల‌ను రీమేక్ చేసే చాలామంది టాప్ హీరోల కంటే తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ గౌత‌మీపుత్ర శాత‌కర్ణి చ‌రిత్ర‌ను సినిమాగా తీస్తున్న బాలయ్యే గొప్ప‌వాడంటున్నారు నంద‌మూరి అభిమానులు…దీంతో మెగా అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు… చిరు, బాల‌య్యల సినిమాలు విడుద‌ల కాక‌ముందే ఫ‌స్ట్‌లుక్స్‌పైనే ఇంత ర‌చ్చ జ‌రుగుతుంటే ఇది ఎటు దారితీస్తుందో అని బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డిపోతున్నారు. ఈ మెగా, నంద‌మూరి వార్ ఎటు దారితీస్తుందో చూడాలి. సంక్రాంతి స‌మ‌రంలో పందెం కోళ్ల‌లా పోటీ ప‌డుతున్న చిరు, బాల‌య్య‌ల్లో ఎవ‌రిది పైచేయి అవుతుందో చూడాలి.

Loading...

Leave a Reply

*