ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీలో సాయిధ‌ర‌మ్ తేజ్‌..?

jr-ntr

టాలీవుడ్‌లో ఈ వార్త షేక్ చేస్తోంది. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత తార‌క్ కొత్త సినిమానిదాదాపు క‌న్‌ఫ‌మ్ చేశాడ‌ని, అది బాలీవుడ్ రీమేక్ అని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, అది కాదంటూనే.. తార‌క్ న్యూ మూవీ త‌మిళ్ రీమేక్ అనే రూమ‌ర్ కూడా వినిపిస్తోంది.

రీసెంట్‌గా యంగ్‌టైగ‌ర్ ఓ త‌మిళ్ స్టార్ డైరెక్ట‌ర్‌కి చాన్స్ ఇచ్చాడ‌ని, అది త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్లనుంద‌నే గాసిప్ న‌డుస్తోంది. ఆ ద‌ర్శ‌కుడు చెప్పిన ఓ బాలీవుడ్ మూవీ స్టోరీ న‌చ్చ‌డంతో దానికే ఆయ‌న గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని చెబుతున్నారు. కానీ, అంత‌లోనే తార‌క్‌.. ఓ త‌మిళ్ సినిమా క‌థ‌ని కూడా విన్నాడ‌ట‌. అది కూడా బావుంద‌ట‌. అది అజిత్ మూవీ అని.. అందులో ఓ యువ హీరోకి కూడా చాన్స్ ఉంద‌ని, ఆ పాత్ర‌లో యువ మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ అయితే అదిరిపోతుంద‌ని భావిస్తున్నారట‌. దీంతో, ఆయ‌న‌ను సంప్ర‌దించే ప‌నిలో ఉన్నార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఇంత గ్యాప్ తీసుకోవ‌డం ఫ్యాన్స్‌కు ఇబ్బందిగా మారింది. ఆ రేంజ్ స‌క్సెస్ వ‌చ్చినా.. తార‌క్ ప్లానింగ్ లేక‌పోవ‌డంతో కాస్త ఇబ్బంది ప‌డుతున్న మాట వాస్త‌వం. ఇప్ప‌టికే ఎంద‌రో ద‌ర్శ‌కుల‌ను ట్రై చేసిన తార‌క్‌.. ఫైన‌ల్‌గా ఓ త‌మిళ్ డైరెక్ట‌ర్‌తో సెట్ అయిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై అఫిషియల్‌గా త్వ‌ర‌లోనే ఓ స్టేట్‌మెంట్ రావొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి, ఇది అయినా నిజ‌మా..? కాదా.. అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*