ఇది మెగా బాహుబలి

untitled-2

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తూ చేస్తోన్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. మరోవైపు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో మరోసారి నిలబెట్టడానికి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘బాహుబలి-2’. ఈ రెండు ప్రెస్టీజియస్ సినిమాలు ఓ చోట చేరితే ఎలా ఉంటుందంటే.. కన్నుల పండుగగా ఉంటుందనే చెప్పుకోవాలి. తాజాగా ఆ పండుగను ఆవిష్కరిస్తూ ‘మెగా బాహుబలి’ కలయిక ఓ కొత్త కళను తీసుకొచ్చింది.

అవును.. బాహుబలి సెట్స్ ను చిరంజీవి సందర్శించారు. అనుకోని అతిథిని చూసి బాహుబలి అవాక్కయ్యాడు. వెంటనే వెళ్లి మెగాస్టార్ ను కౌగలించుకున్నాడు. ఒక్కసారిగా ఖైదీ గెటప్ లో చిరంజీవిని చూసిన బాహుబలి టీం ఆశ్చర్యంలో మునిగిపోయింది. చిరంజీవికి ఘనస్వాగతం పలికింది. రాజమౌళి, ప్రభాస్ తో పాటు టోటల్ యూనిట్ అంతా చిరును చూసి పులకించిపోయింది. ఇదిలా ఉండగా… ప్రభాస్ కు అందరికంటే ముందే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వ్యక్తి గా మారాడు చిరంజీవి. రేపు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బాహుబలి సెట్స్ ను సందర్శించి, ప్రభాస్ కు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాహుబలి ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ముంబయిలో జరుగుతున్న ఫిలింఫెస్ట్ లో ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం ఉంటుంది. ప్రభాస్ తోపాటు నటీనటులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

Loading...

Leave a Reply

*