అబ్బో ఈసారి మెగా స్కెచ్ వేశాడుగా…

maruthi

వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ కొట్టే మారుతి ఈమధ్య చప్పుడు చేయడం లేదు గమనించారా.. ఆ సైలెన్స్ వెనక చాలా పెద్ద వయొలెంట్ ప్లాన్ ఉంది. అవును.. తనను తాను బిగ్ డైరక్టర్ గా ముద్రవేసుకునేందుకు మారుతి పావులు కదుపుతున్నాడు. అందుకే కుర్రహీరోల్ని పక్కనపెడుతున్నాడు. ఓన్లీ స్టార్స్ అంటున్నాడు. ఈ దిశగానే ఓ కుర్రహీరోకు తాజాగా హ్యాండ్ ఇచ్చాడు మారుతి.

బాబు బంగారం, భలే భలే మగాడివోయ్ సినిమాలతో మారుతి రేంజ్ పెరిగింది. బాబు బంగారం సినిమా పెద్దగా ఆడకపోయినా వెంకీతో సినిమా చేశాడు కాబట్టి మారుతి కూడా బడా డైరక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు. ఆ ఇమేజ్ ను అలాగే కొనసాగించాలంటే మళ్లీ కుర్రాళ్లతో సినిమాలు చేయకూడదు. అందుకే కోరి వచ్చిన శర్వానంద్ ను కూడా పొమ్మన్నాడట మారుతి. తన టార్గెట్ ను ఇప్పుడు మెగా కాంపౌండ్ పై ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

మారుతికి మెగా కాంపౌండ్ తో మొదట్నుంచి మంచి సంబంధాలున్నాయి. బన్నీ-మారుతి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. ఆ పరిచయంతో మిగతా మెగా హీరోల్ని కూడా ఓ రేంజ్ లో కెలికాడట మారుతి. ఓ 2-3 కథలు పట్టుకొని కాంపౌండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కుదిరితే బన్నీ, కుదరకపోతే చెర్రీ అన్నట్టు మాట్లాడుతున్నాడట. మరి మారుతి ఈసారి ఎవర్ని పడతాడో చూడాలి.

Loading...

Leave a Reply

*