ప్ర‌భాస్‌ని చూస్తే వేరే ఫీలింగ్స్ వ‌స్తే….. మంచు ల‌క్ష్మీ బాంబ్ పేల్చింది..!

manchu

మంచుల‌క్ష్మీ.. తెలుగునాట ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మోహ‌న్‌బాబు వార‌సురాలిగా మొద‌ట బుల్లితెర‌పై కెరీర్‌ని షురూ చేసిన ఈ మంచు వార‌మ్మాయి.. ఆ త‌ర్వాత బిగ్ స్క్రీన్‌పైనా సంచ‌ల‌నాలు సృష్టించింది. విల‌న్‌గా, హీరోయిన్‌గా, కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాత‌గా.. స‌క్సెస్ అయింది. ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసింది. ఇదంతా ఓకే. కానీ, ఇటీవ‌ల ఆమె గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాహుబ‌లిలో పాపుల‌ర్ అయిన రాజ‌మాత పాత్ర‌.. అదేనండీ.. శివ‌గామి రోల్‌కి మొద‌ట రాజ‌మౌళి మంచు ల‌క్ష్మీకే ఇచ్చాడ‌ట‌.

ఆమెను ఆ రోల్ చెయ్య‌మ‌ని అడిగాడ‌ట‌. కానీ, మంచు ల‌క్ష్మీ నో చెప్పింది. ఆ పాత్ర ఎంత పాపుల‌ర్ అయిందో స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు.అయితే, ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది బిగ్ ప‌జిల్‌గా మారింది. ఇటీవ‌ల త‌న షోకి వ‌చ్చిన మంచు లక్ష్మీని ఆలీ ఇదే ప్ర‌శ్న వేశాడు. మీరు శివ‌గామి పాత్ర‌ను ఎందుకు చెయ్య‌లేదు.. అని.. దానికి ఆమె చెప్పిన ఆన్స‌ర్ ఏంటంటే.. శివ‌గామి పాత్ర‌ను చెయ్య‌న‌ని తాను అన‌లేద‌ట‌. కానీ, ప్ర‌భాస్‌కి త‌ల్లి పాత్ర చెయ్య‌న‌ని మాత్ర‌మే చెప్పింద‌ట‌.

ఎవ‌రి అమ్మ‌గా అయినా ప‌ర్లేదు కానీ… ప్ర‌భాస్ మ‌ద‌ర్‌గా అంటే హౌ..? నాకు కొడుకు ఫీలింగ్ రావాలి క‌దా… వేరే ఫీలింగ్స్ వ‌స్తే అక్క‌డ తేడా వ‌చ్చేస్త‌ది క‌దా.. అంటూ బాంబ్ పేల్చింది ఈ ల‌క్ష్మీ బాంబ్‌. అందుకే, ఇంత నిజాయితీగా, బోళాత‌నంగా మ‌న‌సులో ఏదీ దాచుకోకుండా మాట్లాడుతుంది కాబ‌ట్టే.. మంచు ల‌క్ష్మికి అంత‌మంది అభిమానులున్నారు. మంచు లక్ష్మి ఇంత ఓపెన్ గా, తన మనసులో మాట చెప్పినందుకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.

Loading...

Leave a Reply

*