బావ‌.. ఇలా చేస్తావ‌ని అనుకోలేదు.. జ‌య‌దేవ్‌తో మ‌హేష్‌…!

mahesh-babu

శ్రీమంతుడు సినిమా మ‌హేష్ కెరీర్‌నే మార్చివేసింది. సూప‌ర్‌స్టార్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ ఈ మూవీ. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యంతో రికార్డుల మోత మోగింది. అయితే, ఈ రీల్ శ్రీమంతుడు… రియ‌ల్ శ్రీమంతుడుగానూ మారిపోయాడు. ఊరు ద‌త్త‌త కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ఈ మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీ రాజ‌కీయంగానూ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఎంద‌రో సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు, విద్యావేత్త‌లు…. త‌మ సొంత గ్రామాల‌కు ఏదో కొంత సాయం చేయాల‌నే సంక‌ల్పాన్ని ఇది రెట్టింపు చేసింది. లేకుంటే, లావ‌యిపోతార‌ని భావించేలా చేసింది శ్రీమంతుడు.

ఇదే స్ఫూర్తితో మ‌హేష్‌బాబు అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నాడు. తెలంగాణ‌లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని ఓ మారుమూల ప‌ల్లెటూరిని ద‌త్త‌త తీసుకున్న మ‌హేష్‌బాబు… ఏపీలో ఆయ‌న స్వ‌గ్రామ‌మైన బుర్రిపాలెంను ద‌త్త‌త తీసుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆద‌ర్శ‌వంత‌మైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు సంక‌ల్పించాడు. బుర్రిపాలెం వాసుల‌కు మంచినీరు, రోడ్లతోపాటు డ్రైనేజ్ వంటి సౌక‌ర్యాల‌ని అందించేందుకు త‌న వంతు కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టాడు. నాలుగు నెల‌ల క్రితం.. ఆయ‌న భార్య నమ్ర‌త బుర్రిపాలెం విచ్చేసి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. అవి ఇప్ప‌టికి ఫ‌లించాయి. బుర్రిపాలెం ముఖ‌చిత్రాన్ని కొంత మార్చారు సూప‌ర్‌స్టార్‌. రోడ్లు, డ్రైనేజ్‌లు వేసి కొత్త పుంత‌లు తొక్కించారు.

అయితే, ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ మ‌హేష్ బావ, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ద‌గ్గ‌రుండి మరీ చూసుకున్నారు. బావమ‌రిది ఆశ‌యాన్ని, ఆలోచ‌న‌ల‌ను అర్ధం చేసుకొని త‌న వంతు సాయం చేశారు. అందుకే, స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే బుర్రిపాలెంలో స‌క‌ల సౌక‌ర్యాల‌ను అందించ‌గ‌లిగార‌ట‌. దీంతో, అక్క‌డివాసులు ఆనందంగా ఉన్నార‌ట‌. బుర్రిపాలెం వాసుల సంతోషాన్ని చూసి మ‌హేష్ కూడా ఉప్పొంగిపోతున్నాడ‌ట‌. ఇదంతా గ‌ల్లా జ‌య‌దేవ్ కృషి ఫ‌లిత‌మే అని భావించిన మ‌హేష్‌.. బావ‌కు థ్యాంక్స్ చెప్పాడ‌ట‌. త‌న‌ను రియ‌ల్ శ్రీమంతుడుగా మార్చినందుకు సంతోషం బావ అంటూ ఆనందాన్ని షేర్ చేసుకున్నాడ‌ట‌. టోట‌ల్‌గా మ‌హేష్ మాత్రం ఫుల్ జోష్‌లో ఉన్నాడ‌ట‌.

Loading...

Leave a Reply

*