మహేష్ మార్కెట్ ను తొక్కిపెడుతున్నారు…

unnamed

ఓ స్టార్ హీరో సినిమా మొదలైందంటే చాలు… అప్పుడే బిజినెస్ కూడా మొదలైపోతుంది. అడ్వాన్సులు, బ్లాంక్ చెక్కులు వెల్లువలా వచ్చిపడుతుంటాయి. అంతెందుకు సినిమాకు ఇలా కొబ్బరికాయ కొట్టినవెంటనే.. అలా టేబుల్ ప్రాఫిట్ తో షూటింగ్ మొదలుపెట్టుకోవచ్చు. తెలుగులో దాదాపు ప్రతి స్టార్ హీరోకు ఇదే పరిస్థితి ఉంది. కానీ మహేష్ సినిమాకు మాత్రం ఇలా జరగడం లేదు. కావాలనే మార్కెట్ ను తొక్కిపడేస్తున్నారు. ఎఁదుకు…?

బ్రహ్మోత్సవంతో మహేష్ అట్టర్ ఫ్లాప్ తెచ్చుకున్నాడు. కానీ అతడి మార్కెట్ వాల్యూ మాత్రం ఏమాత్రం తగ్గలేని మురుగదాస్ ప్రాజెక్ట్ నిరూపిస్తోంది. ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అంటే మార్కెట్లో మహేష్ స్టామినా అలానే ఉంది. ఇంతలోనే కొరటాల శివ సినిమా కూడా ప్రారంభమైంది. కానీ ఈ సినిమాకు మాత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే.. కొరటాల సినిమాతో వంద కోట్ల రూపాయల బిజినెస్ ను టార్గెట్ చేశారట. ఒకవేళ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా బ్రహ్మాండంగా హిట్ అయితే, అప్పుడు కొరటాల శివ సినిమాకు క్రేజ్ మరింత పెరుగుతుంది.

ఓవైపు జనతా గ్యారేజ్ హిట్ తో కొరటాలకు క్రేజ్.. మరోవైపు మురుగదాస్ సినిమా హిట్ అయితే మహేష్ కు ఉన్న క్రేజ్ డబుల్ అవుతుంది… ఇలా రెండు క్రేజుల్ని క్యాష్ చేసుకొని.. వంద కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్లాన్ చేశాడట నిర్మాత దానయ్య. అందుకే ప్రస్తుతానికి తన సినిమాకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు పెట్టుకోలేదు.

Loading...

Leave a Reply

*