30 కోట్ల ఆఫ‌ర్‌కి నో చెబుతున్న మ‌హేష్ బాబు..!

mahesh-not-impressed-with-sunder-c-story

బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి అయ్యాడు. చిరంజీవి ఖైదీ నంబర్ 150 అయ్యాడు. ఇక ప్రభాస్ ఎప్పుడో బాహుబలిగా మారాడు. ఇప్పుడు మహేష్ బాబు కూడా త్వరలోనే సంఘమిత్రగా మారబోతున్నాడట. పైన చెప్పుకునే ప్రాజెక్టుల్లానే ఇది కూడా భారీ బడ్జెట్ సినిమాగా, మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా మారబోతోంది. అయితే అంతా అనుకుంటున్నట్టు ఇది మహేష్ బాబు-మురుగదాస్ సినిమా టైటిల్ కాదు.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు. అయితే తమిళ దర్శకుడు సుందర్ సి.. మహేష్ బాబుతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడనే వార్త మాత్రం ఇండస్ట్రీలో బాగా హల్ చల్ చేస్తోంది. ఈ ప్రాజెక్టుకే సంఘమిత్ర అనే పేరుపెట్టారట. ఇందులో మహేష్ తో పాటు తమిళ స్టార్ జయం రవి హీరోగా నటిస్తాడట. ఈ ప్రాజెక్టులో నటిస్తే.. మహేష్ కు 30కోట్ల రూపాయలు ఇస్తామని నిర్మాతలు ఆశచూపుతున్నారట. ఒకవేళ మహేష్ కనుక ఒప్పుకుంటే… టోటల్ సౌత్ లోనే అత్యథిక పారితోషికం తీసుకున్న నటుడు అవుతాడు.

మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కంప్లీట్ అవ్వగానే,,, కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు మహేష్. ఈ ప్రాజెక్టు ఈమధ్యే కన్ ఫర్మ్ అయింది. అయినప్పటికీ… మహేష్ బాబు మల్టీస్టారర్ లో నటిస్తాడంటూ ప్రచారం జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో చంద్రకళ, కళావతి లాంటి సినిమాలకు సుందర్ సి దర్శకత్వం వహించారు. అలనాటి నటి ఖుష్బూ భర్తే ఈ సుందర్.

 

Loading...

Leave a Reply

*