ఈ త‌రం శివ‌గా మ‌హేష్‌..!

mahi

శివ‌.. స‌రిగ్గా 27 ఏళ్ల క్రితం.. ఈ సినిమా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌, నాగార్జున కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం ఇది. వ‌ర్మ‌కు ఇది తొలి చిత్రం. ఈ ఒక్క సినిమాతోనే ఆయ‌న ద‌ర్శ‌కుడిగా క‌ల్ట్ స్టేట‌స్‌ను పొందాడు. ఎన్నో రికార్డులు తిర‌గ‌రాశాడు. కొత్త చరిత్ర సృష్టించాడు. వర్మ కెరీర్‌లోని టాప్ 3 చిత్రాల‌లో శివ‌కు కూడా స్థానం ఉంటుంది. ఈ సినిమా త‌ర్వాతే తెలుగు సినిమా చ‌రిత్ర‌ను శివ‌కు ముందు, శివ త‌ర్వాత అంటూ ఓ కొత్త లైన్‌ను గీశారు కొంద‌రు.ఈ విష‌యాల‌ను ప‌క్క‌న‌పెడితే.. అంత‌టి సంచ‌ల‌న సినిమా త‌ర్వాత మ‌రో శివ రానుంద‌ట తెలుగులో. ఈ సినిమాలో హీరో మ‌హేష్‌. అయితే, ద‌ర్శ‌కుడు వ‌ర్మ కాదు.. ఇది శివ‌కు రీమేక్ కాదు. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మూవీకి ఈ టైటిల్‌ని అనుకుటుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆగ‌స్ట్ నుంచి సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శ‌ర‌వేగంగా జరుగుతోంది.

ద‌స‌రానాటికి ఫస్ట్ లుక్‌ని విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్.ఇటు అభిమ‌న్యుడు అనే టైటిల్ కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. కానీ, శివకే అంద‌రూ ఓటేస్తున్న‌ట్లు స‌మాచారం. నాటి శివ‌లా ఈ చిత్రం కూడా సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుంద‌ని కాన్‌ఫిడెంట్‌గా ఉన్నాడ‌ట మురుగ‌దాస్. చ‌ట్టం బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఓ కొత్త చరిత్ర‌ను క్రియేట్ చేస్తుంద‌ని స్టాలిన్ త‌ర్వాత ముగ్గురు మ‌రో ముగ్గురికి సాయ ప‌డ‌డం, క‌త్తి త‌ర్వాత కోలా కంపెనీల అరాచ‌క‌త్వం, ర‌మ‌ణ‌(తెలుగులో ఠాగూర్ రీమేక్‌) త‌ర్వాత అవినీతిపై ఎంత‌లా మాట్లాడుకున్నారో.. ఈ చిత్రం త‌ర్వాత చ‌ట్టంలోని లోపాలు భార‌తీయ వ్య‌వ‌స్థ‌పైనా అంత‌కు ప‌దిరెట్లు సెన్సేష‌న్ అవుతుంద‌ని కాన్‌ఫిడెంట్‌గా ఉన్నాడు మురుగ‌దాస్‌. అందుకే, శివ టైటిల్ అయితే బెట‌ర్ అని ఆయ‌న భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌పై మురుగదాస్ ప‌ట్టుబ‌డుతున్నా.. మ‌హేష్ మాత్రం వ‌ద్దంటున్నట్లు స‌మాచారం. ఆ శివ‌కి, ఈ శివ‌కి కంపారిజ‌న్స్ పెరుగుతాయ‌ని అందుకే, వ‌ద్ద‌ని వారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి, సూప‌ర్‌స్టార్ ఏ టైటిల్‌కి ఫిక్స్ అవుతాడో చూడాలి.

Loading...

Leave a Reply

*