మ‌హేష్ బాబు-మురుగ‌దాస్ మూవీ టైటిల్ ఫిక్స్‌… టైటిల్ కేక‌..!

mahesh-babu

బాహుబ‌లి త‌ర్వాత టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మ‌కమైన చిత్రం.. మ‌హేష్ బాబు-మురుగ‌దాస్‌దే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే, ఈ సినిమా టైటిల్‌పై చిత్ర యూనిట్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ఏ టైటిల్ ఫిక్స్ చెయ్యాలో తెలియ‌క గంద‌ర‌గోళంలో ఉంది సినిమా యూనిట్‌. అయితే, ఇన్నాళ్ల‌కు టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇదే ఆ సినిమా టైటిల్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏజెంట్ శివ‌గా మ‌హేష్ మ‌న ముందుకు రానున్నాడ‌ని స‌మాచారం.

ఇది సినిమా యూనిట్ డిక్లేర్ చేసిన టైటిల్ కాదు. కేవ‌లం ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్‌. అభిమానులు ఈ సినిమా ఇదేన‌ని గ‌ట్టిగా భావిస్తున్నారు. వారికున్న స‌మాచారం మేర‌కు ఇదే ఫిక్స్ కావొచ్చ‌ని న‌మ్ముతున్నారు. అందుకే, రేపో మాపో సినిమా టైటిల్ ఫిక్స్ చెయ్య‌డానికి ముందే.. పోస్ట‌ర్‌ని డిజైన్ చేసి సంతృప్తి చెందుతున్నారు.

రీసెంట్‌గా సినిమా టైటిల్స్‌ని అంద‌రికంటే ముందే అభిమానులే అనౌన్స్ చేస్తున్నారు. వ‌చ్చిన లీక్‌ల‌పై వెంట‌నే స్పందించి పోస్ట‌ర్‌ల‌ను త‌యారు చేస్తున్నారు. ఇది ఓ ట్రెండ్‌. గ‌తంలో అత్తారింటికి దారేది, ఆర్య 2 వంటి చిత్రాల టైటిల్స్ విష‌యంలో ఇలానే జ‌రిగింది. స‌రిగ్గా రెండు నెల‌ల క్రితం.. చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 మూవీ టైటిల్‌ని కూడా ముందుగా అభిమానులే లీక్ చేశారు. ఆ త‌ర్వాత టైటిల్ ఇదేనంటూ సినిమా యూనిట్ క‌న్‌ఫ‌మ్ చేసింది. మహేష్‌-మురుగ‌దాస్ మూవీ టైటిల్‌ది కూడా సేమ్ సీన్ అనే ప్ర‌చారం సాగుతోంది.

ఈ సినిమాకి మొద‌ట శివ‌, అభిమాన్యుడు అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు రూమ‌ర్‌లు న‌డిచాయి. ఈ చిత్రంలో మ‌హేష్ రా ఏజెంట్‌గా ప‌నిచేస్తాడ‌ట‌. గూఢ‌చారి మూవీస్‌లాంటి క‌థ‌నంతో న‌డుస్తుంద‌ట‌. అందుకే, ఏజెంట్ శివ అయితే బావుంటుంద‌ని మురుగ‌దాస్ అంచ‌నా వేస్తున్నాడ‌ట‌. ఇటు, మ‌హేష్ కూడా ఓకే అన్న‌ట్లు సమాచారం. మ‌రి, దీపావ‌ళి నాటికి విడుద‌ల కానున్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఇదే పేరు క‌నిపిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*