మ‌హేష్‌-మురుగదాస్ మూవీ టైటిల్ ఫిక్స్‌… అది ఏంటంటే..?

mahesh-murugadoss-movie-title-fixed-as-abhimanyudu

ప్ర‌స్తుతం బాహుబ‌లి 2, రోబో త‌ర్వాత సౌత్‌లో అంద‌రి ఫోక‌స్ ఉన్న మూవీ మహేష్‌-మురుగ‌దాస్ కాంబినేష‌న్‌ది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. మ‌హేష్‌లాంటి సూప‌ర్‌స్టార్‌… మురుగ‌దాస్ లాంటి క్రేజీ, క్రియేటివ్‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడుతో జ‌త క‌ట్ట‌డంతో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఆకాశానికి చేరాయి. ఎంత‌గా అంటే.. ఈ మూవీ టైటిల్ కోస‌మే జ‌నాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా టైటిల్‌పై ఇప్ప‌టికే నెట్టింట్లో బోలెడు ప్ర‌చారం జ‌రిగింది. ఎనిమీ అని మొద‌ట వినిపించింది. ఆ త‌ర్వాత అది చ‌ట్టంతో పోరాటం, చ‌ట్టానికి క‌ళ్లులేవు వంటి పాత సినిమాల టైటిల్స్ కూడా తెరపైకి వ‌చ్చాయి. ఇప్పటికే జస్టిస్, న్యాయం కావాలి వంటి రకరకాల టైటిల్స్ వినిపించాయి .. లేటెస్ట్‌గా శివ అంటూ మ‌రో పేరు కూడా వినిపించింది.

అయితే ఫైనల్ గా ఈ సినిమాకు టైటిల్ ఓకే అయినట్టు తెలుస్తోంది ? ఈ సినిమాకు టైటిల్ ఆల్‌మోస్ట్‌ కన్ఫర్మ్ అయినట్టే, ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా … ”అభిమన్యుడు” !! అవును అన్యాయాలను ఎదుర్కొనేందుకు పోరాడిన అభిమన్యుడి స్ఫూర్తి తో ఈ సినిమా ఉంటుందని, అందుకే ఆ టైటిల్ ఓకే చేస్తున్నట్టు తెలిసింది. ఈ టైటిల్ తో దసరా రోజున ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారట !! మరి అభిమన్యుడిగా మహేష్ ఎలా అదరగొట్టనున్నాడో చూడాలి ?

 

Loading...

Leave a Reply

*