ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో తిరుగుతున్న మ‌హేష్‌బాబు

ma

మ‌హేష్‌బాబు రోడ్డున ప‌డ్డాడు… టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ రోడ్లు ప‌ట్టుకుని తిరుగుతున్నాట్ట‌… హైద‌రాబాద్ రోడ్ల‌ను స‌ర్వే చేస్తున్నాట్ట‌.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తిరుగుతూ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాట్ట‌….అయితే మ‌హేష్‌బాబుకు షూటింగ్‌లు లేక బ్రేక్ దొరికి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయ‌డానికి ఇలా షికార్లు కొట్ట‌డం లేదు… సినిమా షూటింగ్‌లో భాగంగానే రోడ్ల‌పైకి వ‌చ్చాడు ఈ బ‌డా హీరో… సీన్స్‌ని నేచుర‌ల్‌గా తీసే మురుగ‌దాస్ కోరిక మేర‌కు మ‌హేష్ ఇలా రోడ్ల‌పైనే షూటింగ్ చేస్తున్నాడు… మ‌హేష్‌బాబు – ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా రానున్న అభిమ‌న్యుడు సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది…

న‌గ‌రంలో వ‌ర్షాలు ప‌డుతున్నా లెక్క చేయ‌కుండా అభిమ‌న్యుడు రోడ్ల‌పైనే షూటింగ్‌కి హాజ‌ర‌య్యాడు… ఈ అభిమ‌న్యుడు హైద‌రాబాద్ ట్రాఫిక్ ప‌ద్మ‌వ్యూహాన్ని ఛేదించుకుంటూ షూటింగ్ చేస్తున్నాడు… ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బ‌స్ భ‌వ‌న్‌, సంధ్య థియే ట‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొన్ని సీన్స్‌ని చిత్రీక‌రించాడు మురుగదాస్‌….. ఈ సీన్ల‌కు సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.. ఈ నెల 10 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతుంద‌ని, ద‌స‌రా త‌ర్వాత అహ్మ‌దాబాద్‌లో 18 రోజుల పాటు కొత్త షెడ్యూల్‌కి ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.

తెలుగు, త‌మిళంలో రానున్న సినిమా టైటిల్‌, ప్రిన్స్ ఫ‌స్ట్‌లుక్‌ని దీపావ‌ళి సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌న్న‌ది మురుగ‌దాస్ ఆలోచ‌న‌… చెన్నైలో రోడ్ల‌పై షూటింగ్ చేయ‌డం చాలా ఈజీ…. అక్క‌డ షూటింగ్‌కు అల‌వాటుప‌డ్డ మురుగ‌దాస్ కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లో షూటింగ్ చేయాల‌ని భంగ‌ప‌డ్డాడు…. అక్క‌డ షూటింగ్ చేయ‌లేక చేతులెత్తేశాడు.. తాజాగా అష్ట‌క‌ష్టాలు ప‌డి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో షూటింగ్ చేస్తున్నారు. మ‌హేష్‌-మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Loading...

Leave a Reply

*