మొన్న బర్త్ డే… నిన్న దసరా… నేడు దీపావళి….

mahesh

ఇలా ఇంపార్టెంట్ వేడుకలు అన్నింటినీ మహేష్ బాబు డుమ్మా కొడుతున్నాడు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని ఎదురుచూసిన ఘట్టమనేని అభిమానులకు నిరాశే ఎదురైంది. అవును… మహేష్ బాబు ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఈ దీపావళికి మహేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాలేదు.పుట్టినరోజు నాడు ఫస్ట్ లుక్ విజుదల చేస్తాడేమో అని అంతా ఎదురుచూశారు.

అయితే అప్పటికి సినిమా ప్రారంభమై కేవలం 10రోజులు మాత్రమే అయింది కాబట్టి… ఫస్ట్ లుక్ విడుదలచేయడం అసంభవం అనిప్రేక్షకులు కూడా ఫిక్స్ అయ్యారు. తర్వాత దసరాకు కచ్చితంగా ఫస్ట్ లుక్ వస్తుందని అనుకున్నారు. ఎందుకంటే.. టీజర్ కోసం అప్పటికే ప్రత్యేకంగా షూటింగ్ కూడా చేశారని వార్తలు రావడంతో.. దసరాకు పండగ చేసుకోవచ్చని ఘట్టమనేని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ అది జరగలేదు. తాజాగా దీపావళికి కూడా మహేష్ బాబు హ్యాండ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఉసూరుమన్నారు.

ఏజెంట్ శివ, అభిమన్యుడు టైటిల్స్ లో ఒక పేరును మహేష్, మురుగదాస్ సినిమాకు పెట్టారనే టాక్ బలంగా వినిపిస్తోంది. తమిళ్ లో కేవలం తమిళ టైటిల్ మాత్రమే పెట్టాలి. లేదంటే ట్యాక్స్ మినహాయింపు రాదు. అందుకే తెలుగు-తమిళ టైటిల్స్ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఉండేందుకు ఓ మంచి టైటిల్ కోసం వెదుకుతున్నారు.

Loading...

Leave a Reply

*