ఎడిటింగ్ అవ్వలేదు.. అందుకే టైటిల్ చెప్పట్లేదు…

untitled-16

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఏంటో చెప్పుకోండి చూద్దాం… అది మీ వల్ల కాదు… మీరే కాదు… ఎవరూ మహేష్ బాబు సినిమా టైటిల్ ఎంటనే విషయాన్ని చెప్పలేరు. చివరికి మహేష్ బాబును ఈ ప్రశ్న అడిగినా బిక్కమొహం వేయడం ఖాయం. ఎఁదుకంటే.. టైటిల్స్ విషయంలో రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి టైటిల్ ఫిక్స్ చేసి సీక్రెట్ గా ఉంచడం. ఈ పద్ధతిలో హీరో-డైరక్టర్ కు సినిమా పేరు తెలుస్తుంది. కానీ బయటకు మాత్రం చెప్పరు. ఇక రెండో పద్ధతి. ఏ పేరు పెట్టాలో తెలియక జుట్టు పీక్కోవడం. ప్రస్తుతం ఈ పద్ధతే ఫాలో అవుతోంది మహేష్ టీం.

మురుగదాస్ తో చేస్తున్న సినిమాకు ఏ టైటిల్ పెట్టాలో తెలీక బుర్ర బద్దలుకొట్టుకుంటున్నాడట మహేష్. మరోవైపు దర్శకుడు మురుగ కూడా అదే రేంజ్ లో చొక్కాలు చించుకుంటున్నాడట. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు సంబంధించి మార్కెట్లో 5 టైటిల్స్ రౌండ్స్ కొడుతున్నాయి. వాస్కోడీ గామ, చట్టంతో పోరాటం, ఎనిమీ, ఏజెంట్ శివ, అభిమన్యుడు. ఈ 5 టైటిల్స్ లో ఒకటి ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట.

అయితే తాజాగా మరో వార్త కూడా బయటకు వచ్చింది. మహేష్ కొత్త సినిమా టీజర్ కోసం ఏకంగా అతడిపై టీజర్ షూటింగే చేశారు. ఏదో ఫొటో రిలీజ్ చేసి వదిలేయకుండా… టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ పెట్టారట. ఆ ఫుటేజ్ ప్రస్తుతం ఎడిటింగ్ స్టేజ్ లో ఉందట. ఆ ఎడిటింగ్ అయితే కానీ టైటిల్ ఫిక్స్ చేయరట. అదీ సంగతి.

Loading...

Leave a Reply

*