మరో రెండేళ్లు మహేష్ బిజీ బిజీ…

mahi

ఇప్పటివరకు మహేష్ కెరీర్ లో గ్యాప్ అనేదే లేదు. అప్పుడెప్పుడో ఖలేజా టైమ్ లో మాత్రమే మహేష్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. తర్వాత ఎప్పుడూ అంత గ్యాప్ తీసుకోలేదు. తీసుకోవాలని అనుకోవడం కూడా లేదు. తాజాగా ఈ స్టార్ సినిమాల విషయంలో ఇంకాస్త ఎక్కువ స్పీడ్ పెంచాడు. గతంలో మహేష్ తండ్రి కృష్ణ రోజూ 3షిఫ్టులు పనిచేసినట్టు… ఇప్పుడు మరీ అంత హెవీగా కాకపోయినా… ఉన్నంతలో కెరీర్ లో గ్యాప్ రాకుండా జాగ్రత్తపడుతున్నాడు ప్రిన్స్.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మరో సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే.. మహేష్ అప్పుడే మరో సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. కొరటాల శివ సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. పీవీపీ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నట్టు మహేష్ ప్రకటించాడు.

అంటే 2018వరకు మహేష్ కాల్షీట్లు అన్నీ నిండిపోయాయన్నమాట. కుదిరితే వచ్చే ఏడాది జులై లేదా ఆగస్ట్ నుంచి మహేష్ బాబు సినిమా ప్రారంభిస్తామని అంటున్నాడు నిర్మాత పీవీపీ. ఈ మేరకు ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని ప్రకటించాడు. ఈ సినిమాక వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని చెబుతున్నాడు. మొత్తానికి చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వంశీ పైడిపల్లికి ఎట్టకేలకు ఛాన్స్ ఇచ్చాడు మహేష్.

Loading...

Leave a Reply

*