మ‌హేష్ త‌ర్వాత బ‌న్నినే…!

mahesh-bunny

నిన్న మ‌హేష్‌.. నేడు బ‌న్ని.. ప్రెజెంట్ టాలీవుడ్‌లో ప‌లువురు కోలీవుడ్ హీరోల‌కు భారీ క్రేజ్ ఉంది. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, సూర్య‌, కార్తి వంటి హీరోల‌కి ఇక్క‌డ తిరుగులేని మార్కెట్ కూడా ఉంది. మ‌రోవైపు, డ‌బ్బింగ్ సినిమాల‌కు ఇక్క‌డ ఆద‌ర‌ణ కూడా బాగానే ఉంటుంది. జ‌ర్నీ, షాపింగ్‌మాల్ వంటి సినిమాలు భారీగా వ‌సూళ్లు సాధించాయి తెలుగు మార్కెట్‌లో. కానీ, మ‌న తెలుగు హీరోలు మాత్రం త‌మిళ మార్కెట్‌లో ఎంటర్‌కాలేక‌పోతున్నారు. చిరంజీవి, బాల‌య్య‌, నాగ్ వంటి హీరోల‌కు అక్క‌డ ఇమేజ్ ఉన్నా.. భారీ రికార్డులు నెల‌కొల్పిన సినిమాలు మాత్రం లేవు. ఇదే ఇప్పుడు ఈ జ‌న‌రేష‌న్ తెలుగు హీరోల‌కు స‌వాల్‌గా మారింది. త‌మిళ్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చి అక్క‌డ విజ‌యాలు సాధించ‌డ‌మే మ‌న‌కు కావాల్సింది.

ఇన్నాళ్లూ మ‌న హీరోలు కోలీవుడ్‌పై ఫోక‌స్ పెట్ట‌లేదు. అక్క‌డ డ‌బ్బింగ్ సినిమాల‌కు, ఇతర భాష‌ల హీరోల‌కు స‌రైన మార్కెట్ ఉండ‌ద‌నే భావ‌న‌తో తెలుగుకే ప‌రిమిత‌మ‌య్యారు. ఇటీవ‌ల బ‌న్ని, ఎన్టీఆర్ లాంటి హీరోలు మ‌ల‌యాళంపై ప‌ట్టు సాధించే ప‌నిలో ప‌డ్డారు. ఇక‌, క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ శాండ‌ల్‌వుడ్‌లో టాలీవుడ్‌దే హ‌వా. సౌత్‌లో మ‌న హీరోల‌కు అంద‌ని ద్రాక్ష‌లా ఊరిస్తోంది ఒక్క కోలీవుడ్‌నే. అందుకే, అక్క‌డి మార్కెట్‌పై ఫోక‌స్ పెట్టారు మ‌న క‌థానాయ‌కులు.కోలీవుడ్ కోసం ప‌క్కా స్కెచ్ వేస్తున్నారు మ‌న బ‌డా హీరోలు. త‌మిళ్ హీరోల‌లా డ‌బ్బింగ్ సినిమాల‌ను న‌మ్ముకోవ‌డం లేదు. స్ట్ర‌యిట్ చిత్రాల‌తోనే అక్క‌డి మార్కెట్‌ని ద‌క్కించుకునే ప‌ని చేస్తున్నారు. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌.

కోలీవుడ్‌లోనూ ఘ‌ట్ట‌మ‌నేని జెండా ఎగుర‌వేయాల‌నేది ఆయ‌న ప్లాన్‌. అందుకే, మురుగ‌దాస్ వంటి బ‌డా ద‌ర్శ‌కుడితో వంద కోట్ల బ‌డ్జెట్‌తో సినిమాకి క‌మిట‌య్యాడు ప్రిన్స్‌. ఇదే ఊపులో తాజాగా బ‌న్ని కూడా తమిళ్ ల్యాండ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆవారా, పందెంకోడి వంటి విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇది త్వర‌లోనే సెట్స్‌మీద‌కు రానుంది. మ‌హేష్‌,బ‌న్నివి ద్విభాషా చిత్రాలే కావ‌డం విశేషం. తెలుగు, త‌మిళ్‌లో ఒకేసారి తెర‌కెక్కుతాయి ఈ చిత్రాలు. ఈ ఇద్ద‌రి రూట్‌లో మిగ‌తా హీరోలు ఎప్పుడు ఎంట‌ర్ అవుతార‌నేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*