బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబు స‌ర‌స‌న హాలీవుడ్ అంద‌గ‌త్తె…!

untitled-2-copy

మహేష్ బాబు ఇప్పుడు స్పీడ్ పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయబోతున్నాడు. అది కంప్లీట్ అయిన వెంటనే… పీవీపీ బ్యానర్ లో వంశీ పైడిపల్లి తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఇలా మహేష్ సినిమాల విషయంలో జోరు పెంచిన మాట వాస్తవమే అయినప్పటికీ… అతడి సినిమాలకు ఇప్పుడు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది.

ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమాకు గతంలో పరిణీతి చోప్రాను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ బడ్జెట్ లో కోత విధించడంతో పరిణీతిని పక్కనపెట్టారు. తాజాగా ఇప్పుడు ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. మహేష్ అప్ కమింగ్ మూవీలో ప్రియాంకా చోప్రా నటించే అవకాశం ఉందట. అయితే అది కొరటాల శివ సినిమాలోనా… పీవీపీ బ్యానర్ సినిమాలోనా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఓ కొత్త జానర్ లోకి ఎంటర్ అవుతున్నానని. సౌత్ లో మరోసారి నటించే ఛాన్స్ ఉందని ప్రియాంకా చోప్రా స్వయంగా ప్రకటించింది. దీంతో మహేష్ సినిమా చుట్టూ ఈ రూమర్లు అల్లుకున్నాయి. గతంలో రామ్ చరణ్ సరసన ప్రియాంకా చోప్రా… తుఫాన్ అనే సినిమాలో నటించిన విషయ తెలిసిందే. మరోవైపు ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదిగిన ఈ అమ్మడు… బాలీవుడ్ ను కూడా వదిలి సౌత్ కు వస్తుందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Loading...

Leave a Reply

*