అక్కడ మహేషే మొనగాడు

mahesh1

జనతా గ్యారేజ్ సినిమా అద్భుతంగా ఆడేస్తోందంటున్నారు. ఓవర్సీస్ లో తారక్ స్టామినా పెంచిందంటున్నారు. మరోవైపు బాహుబలి సినిమాతో ప్రభాస్ కూడా ఓవర్సీస్ లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బాహుబలి వసూళ్లను మరే సినిమా క్రాస్ చేయలేకపోయింది.ఇంకోవైపు నితిన్, నాని లాంటి హీరోలు కూడా ఓవర్సీస్ లో తమ సత్తా చాటుతున్నారు. నితిన్ అయితే అ..ఆతో ఏకంగా బ్యాంకబుల్ హీరో అయిపోయాడు. ఇలా ఎన్నో విశ్లేషణలు..మరెన్నో కథనాలు.. కానీ అల్టిమేట్ గా లిస్ట్ లో నిలిచేది మాత్రం మహేష్ మాత్రమే.

ఈమధ్య కాలంలో ఫ్లాపులు వచ్చి ఉండొచ్చు. కానీ ఓవర్సీస్ టాప్-10 జాబితాలో అత్యధిక సినిమాలు కలిగిన వ్యక్తి మహేష్ మాత్రమే. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో ఎన్టీఆర్ కూడా టాప్-10లో ఉన్నాడు. కానీ సినిమాలు మాత్రం రెండే. నాగార్జున కూడా టాప్-10లో ఉన్నాడు. కానీ సినిమాలు రెండే. 3 సినిమాలతో లిస్ట్ లో కొనసాగుతున్న ఏకైక హీరో మహేష్ మాత్రమే. ఓవర్సీస్ లో ఆల్ టైం వసూళ్లు అందుకున్న తొలి-10 సినిమాల జాబితా ఇదిగో…

1. బాహుబలి – $ 6,997,636 (46.88 Cr)
2. శ్రీమంతుడు – $2,891,742 (19.37 cr)
3 అ..ఆ.. – $ 2,44,5037 (16.38 crores)
4. నాన్నకు ప్రేమతో – $ 2,019,418 (13.53 crores)
5. అత్తారింటికి దారేది – $ 1,897,541 (12.71 cr)
6. జనతా గ్యారేజ్ – $ 1,800,000 (12.06 cr)
7.సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు – $ 1,635,300 (10.95 cr)
8. ఊపిరి – $ 1,569,162 (10.51 cr)
9. దూకుడు – $ 1,563,466 (10.47 cr)
10. మనం – $ 1,538,515 (10.30 cr)

Loading...

Leave a Reply

*