బ్రేకింగ్… చిరంజీవి టైటిల్ తో మహేష్ మూవీ…

untitled-3

చిరంజీవి 150వ సినిమాకు మొదట ఏ టైటిల్ ఫిక్స్ చేశారో తెలుసుగా… దర్శకుడు వీవీ వినాయక్ ఎంతో ఇష్టంగా కత్తిలాంటోడు అనే టైటిల్ ను పెట్టుకున్నాడు. దాన్నే మీడియా కూడా తెగ ప్రచారం చేసింది. కానీ ఏమైందో ఏమో చెర్రీకి మాత్రం అది నచ్చలేదు. పైగా నిర్మాత కూడా కావడంతో కొన్నిరోజుల్లోనే సీన్ మారిపోయింది. కత్తిలాంటోడు అనే టైటిల్ స్థానంలో ఖైదీ నంబర్-150 అనే పేరు ఫిక్స్ చేశారు. ఇప్పుడు మెగా కాంపౌండ్ వదిలేసిన ఆ టైటిల్ పై మహేష్ బాబు కన్నుపడిందట.

అవును… ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు. లాంఛింగ్ నుంచి చాలా పేర్లు అనుకుంటున్నారు. వాస్కోడీగామ, అభిమన్యుడు, శివ.. ఇలా ఎన్నో పేర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఏజెంట్ శివ అనే పేరును కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏజెంట్ శివ అనే పేరుతో పాటు కత్తిలాంటోడు అనే టైటిల్ ను కూడా సీరియస్ గా పరిశీలిస్తోందట మహేష్. బాబు అండ్ కో.

నిజానికి మహేష్ బాబుకు ఇప్పుడు పెద్దగా టైం లేదు. ఇప్పటికే ఓసారి టైటిల్ ఎనౌన్స్ చేస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. ఈసారి దీపావళికి కచ్చితంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ఎనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే టీం అంతా ఇప్పుడు టైటిల్ పై వర్కవుట్ చేస్తోంది. ఇందులో మహేష్ బాబు కూడా పాలుపుంచుకుంటున్నాడు. రేపోమాపో ఓ టైటిల్ ఫిక్స్ చేసి, దీపావళి రోజున టీజర్ ను వదులుతారు.

Loading...

Leave a Reply

*