ఫ్రెండ్ కోసం ముందుకొచ్చిన మహేష్ బాబు

mahesh

ఇండస్ట్రీలో మహేష్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. చాలామంది చాలా పేర్లు చెప్పొచ్చు. కానీ మహేష్ కు, అతడి కుటుంబానికి బెస్ట్ ఫ్రెండ్ మాత్రం సుమంత్. అవును… తీరిక దొరికినప్పుడల్లా సుమంత్ తో స్పెండ్ చేయడానికి మహేష్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. నమ్రత, వాళ్ల పిల్లలకు కూడా సుమంత్ అంటే చాలా ఇష్టం. మహేష్ ఫ్యామిలీతో కలిసి కొన్ని విదేశీ పర్యటనకు కూడా వెళ్లాడు సుమంత్. అలా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు మహేష్ -సుమంత్.

సినిమాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సుమంత్… చాన్నాళ్ల విరామం తర్వాత ఓ సినిమాతో తెరపైకి వస్తున్నాడు. అదే నరుడా-డోనరుడా. హిందీలో హిట్టయిన విక్కీ డోనర్ అనే సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమా తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సుమంత్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఫ్రెండ్ కోసం మహేష్ కూడా ఇప్పుడు ముందుకొచ్చాడు. నరుడా-డోనరుడా సినిమాకు ప్రచారం కల్పించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. ఈ పోస్టర్ చాలామంది టాలీవుడ్ ప్రముఖుల్ని ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడీ మూవీ డిజిటల్ పోస్టర్ ను మహేష్ బాబు విడుదల చేయబోతున్నాడు. ఎప్పుడూ తన కుటుంబ సభ్యుల సినిమాలు, చుట్టాళ్ల కార్యక్రమాల్ని మాత్రమే ప్రమోట్ చేసే మహేష్ బాబు… తొలిసారిగా ఇలా ఫ్రెండ్ కోసం ప్రచారం చేయడానికి ఒప్పుకున్నాడు. సుమంత్ అంటే మహేష్ కు ఎంతిష్టమో చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు.

Loading...

Leave a Reply

*