జనతా గ్యారేజ్ + శ్రీమంతుడు = మహేష్ బాబు కొత్త సినిమా

untitled-12

శ్రీమంతుడు లాంటి భారీ విజయం తర్వాత మరోసారి కొరటాలకు ఛాన్స్ ఇచ్చాడు మహేష్ బాబు. ప్రస్తుతం చేస్తున్నమురుగదాస్ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే.. కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. దీనికి సంబంధించి తెరవెనక ఏర్పాట్లు, అగ్రిమెంట్లు అన్నీ అయిపోయాయి. తాజాగా సినిమాకు సంబంధించి కొరటాల కథ కూడా పూర్తిచేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ కొత్త సినిమా… జనతాగ్యారేజ్, శ్రీమంతుడు మూవీస్ ను కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందట.

అయితే ఈ పోలిక కేవలం హీరోయిన్ల వరకే. కథ పరంగా ఇది డిఫరెంట్ జానర్ మూవీ అని తెలుస్తోంది. మేటర్ ఏంటంటే.. మహేష్ కోసం కొరటాల రాసుకున్న కథలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఆ ఇద్దరు హీరోయిన్లలో ఒకర్ని జనతా గ్యారేజ్ నుంచి ఇంకొకర్ని శ్రీమంతుడు సినిమా నుంచి తీసుకోవాలని కొరటాల అనుకుంటున్నాడట. అంటే… శృతిహాసన్, కాజల్ హీరోయిన్లుగా మహేష్ హీరోగా కొరటాల కొత్త సినిమా ఉండబోతోందన్నమాట.

ప్రస్తుతం కాజల్ చిరంజీవి 150వ సినిమా చేస్తోంది. చిరంజీవితో సినిమా చేసిన తర్వాత మళ్లీ మహేష్ బాబు అవకాశం ఇస్తాడా అనేది ఇక్కడ పెద్ద డౌట్. మరోవైపు శృతిహాసన్ మాత్రం కొరటాల-మహేష్ సినిమా కోసం ఇప్పట్నుంచే కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకుంటూ వస్తోందట. త్వరలోనే మహేష్ బాబు ముద్దుగుమ్మలెవరో తెలిసిపోతుంది.

Loading...

Leave a Reply

*