ప్రేక్షకుల ఆశలపై నీళ్లుచల్లిన కొరటాల

ko

త్వరలోనే మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందురు రెడీ అవుతున్నాడు కొరటాల. ఈ సినిమాకు కూడా జనతా ఫార్ములానే ఫాలో అవుతాడని అంతా అనుకున్నారు. అంటే.. జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ఉన్నట్టు… మహేష్ బాబు సినిమాలో కూడా ఓ బిగ్ స్టార్ ఉంటాడని అంతా అనుకున్నారు. ఈ మేరకు నాగార్జున లేదా బాలకృష్ణల్లో ఒకర్ని మహేష్ బాబు సినిమా కోసం తీసుకోవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటినీ కొరటాల కొట్టిపడేశాడు.

తన సినిమాలో ఫ్యాన్సీ కాంబోలు ఉండవని తేల్చిచెప్పాడు కొరటాల. ఎలాంటి మల్టీస్టారర్ హంగులు లేకుండానే మహేష్ బాబు సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఇకపై ఇలాంటి వార్తలు నమ్మొద్దని కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో రూమర్లకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టే దర్శకుల్లో జక్కన్న తర్వాత కొరటాల లిస్ట్ లో ఉంటాడు. ఒక పుకారు వచ్చిన వెంటనే దానిపై క్లారిటీ ఇవ్వడం రాజమౌళికి అలవాటు.కొరటాల కూడా తన రెండో సినిమా నుంచి అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు.

మహేష్ బాబు సినిమా కూడా ఓ సందేశాన్నిచ్చేలా కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంటుందని స్పష్టంచేశాడు కొరటాల. అంతేకాదు.. మల్టీస్టారర్ కాకపోయినా.. మల్టీ హీరోియన్స్ మాత్రం ఉంటారని చెప్పేశాడు. జనతా గ్యారేజ్, మిర్చి సినిమాల్లో ఉన్నట్టుగానే మహేష్ కొత్త సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అంటున్నాడు కొరటాల.

Loading...

Leave a Reply

*