ఎన్టీఆర్ దెబ్బ‌కి షాక్ అయిన మా టీవీ..!

ntr

ఎన్నో అంచనాల‌తో, భారీ హైప్‌తో మా టీవీ జ‌న‌తా గ్యారేజ్ ప్రీమియ‌ర్ షోని బుల్లితెర‌పై టెలికాస్ట్ చేసింది. దీనికి టీఆర్పీలు బ‌ద్ద‌ల‌వుతాయ‌ని ఊహించింది. రీసెంట్‌గా ఏ సినిమాకి రానంత టీఆర్పీ జ‌న‌తాకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేశారు. ఇటు, గ‌త ప‌దిహేను రోజులుగా మాటీవీలోనూ ప్రోమోల‌తో జ‌న‌తాగ్యారేజ్ ప్రీమియ‌ర్ అంటూ డేట్‌తో స‌హా ఊద‌ర‌గొట్టారు. భారీ ప‌బ్లిసిటీ ఇచ్చారు. గ‌తంలో ఏ బ‌డా హీరో సినిమాకి లేనంత‌గా ఈ మూవీ విడుద‌ల‌యిన 50 రోజుల్లోనే బుల్లితెర‌పై ప్ర‌ద‌ర్శిత‌మ‌యింది. దీంతో, టీఆర్‌పీలు భారీగా వ‌స్తాయ‌ని ఊహించారు. అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ట‌.

ఈ ఆదివారం టెలికాస్ట్ అయిన జ‌న‌తా గ్యారేజ్ మూవీకి సుమారు 15 శాతం టీఆర్పీలు వ‌చ్చాయ‌ట‌. మా టీవీ ఈ మూవీకి మినిమ‌మ్ 20 శాతం అయినా వ‌స్తుంద‌ని అంచ‌నా వేసింద‌ట‌. కానీ, అందులో మూడో వంతే రావ‌డంతో మా టీవీ షాక్ అయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. టీఆర్పీల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. జ‌న‌తా గ్యారేజ్‌కి యాడ్స్ రూపంలో బాగా రెవెన్యూ వ‌చ్చింద‌ట మా టీవీకి. ఆ విష‌యంలో మా యాజ‌మాన్యం ఖుషీ ఖుషీగా ఉంద‌ని స‌మాచారం.మ‌రోవైపు, ఈ ఏడాది ప‌లు బ‌డా సినిమాలు కూడా మంచి టీఆర్పీలు పొంద‌లేక‌పోయాయి. మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం బుల్లితెర‌పైనా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ఈ సినిమాకి కేవ‌లం 8 లోపు టీఆర్‌పీలు వ‌చ్చాయట‌. టాలీవుడ్‌లో ఇటీవ‌ల ఏ అగ్ర హీరో మూవీకి కూడా ఈ రేంజ్‌లో త‌క్కువ టీఆర్‌పీలు రాలేద‌ట‌. ఇక‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో మూవీకి 12.6 శాతం టీఆర్పీలు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. ఇది కూడా పెద్ద సంచ‌ల‌నమేమీ కాదు. రీసెంట్‌గా త‌మిళ్ డ‌బ్బింగ్ మూవీ బిచ్చ‌గాడు ఏకంగా 18.7 శాతం టీఆర్పీలు పొందింద‌ని స‌మాచారం. ఇక‌, ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రం కూడా 15 టీఆర్పీ పొందింద‌ట‌. అంటే, అగ్ర హీరోల సినిమాల కంటే.. ఒక త‌మిళ్ హీరో న‌టించిన బిచ్చ‌గాడు చిత్ర‌మే టాప్ టీఆర్పీని ద‌క్కించుకోవ‌డం విశేషం.

Loading...

Leave a Reply

*