సెక్సీ క్వీన్ పెళ్లికి రెడీ…

lisa

లీసా హెడెన్.. ఈ పేరుకు పాపులారిటీ లేకపోవచ్చు. కానీ ఈ ఫిజిక్ కు మాత్రం పిచ్చ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. రెచ్చిపోయి అందాలు ఆరబోయడంలో లీసా తర్వాతే ఎవరైనా. క్రేజ్ లేకపోయినా.. తన అందాలతో కాసులు బాగానే సంపాదించుకుంది. ఇప్పుడీ బ్యూటీ పెళ్లి చేసుకుంటానని ప్రకటించి, కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది. అవును… బాలీవుడ్‌ నటి లీసా హేడెన్‌ త్వరలోపెళ్లిపీటలెక్కబోతోంది.చెన్నైలో పుట్టిన లీసా పెరిగింది మాత్రం ఆస్ట్రేలియా, అమెరికాల్లోనే. హిందీలో క్వీన్‌,హౌస్‌ఫుల్‌-3 సినిమాల్లో నటించిన లీసా పాకిస్థాన్‌లో పుట్టిన బ్రిటిష్‌ వ్యాపారవేత్త గుల్లు లాల్వానీ కుమారుడు డినో లాల్వానీని వివాహం చేసుకోబోతోంది.

డినో, లీసాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.ప్రస్తుతం డినో తన తండ్రి ప్రారంభించిన బినాటోన్‌ టెలికాం కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. లీసా కూడా తన ప్రేమ విషయం గురించి బహిర్గతం చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. సోషల్‌మీడియా ద్వారా ఎప్పటికప్పుడు డినోతో కలిసి దిగిన ఫొటోలు పోస్ట్‌ చేస్తూనే ఉంది. ఇప్పుడు పెళ్లి విషయమై లీసా కాస్త వెరైటీగా డినోని ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇతన్ని పెళ్లిచేసుకుంటున్నా’’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే పెళ్లి ఎప్పుడు.. అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.

Loading...

Leave a Reply

*