చెర్రీ హీరోయిన్ ల‌వ్ మ్యారేజ్‌.. ర‌చ్చ ర‌చ్చ‌.. 4 రోజుల్లోనే పెటాకుల దిశ‌గా..!

cherry

లీసా హేడెన్ గుర్తుందా..? ఇలా అంటే తెలియ‌దేమో.. ర‌చ్చ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఐటెం సాంగ్ చేసిన ముద్దుగుమ్మ మీకు గుర్తుందా..? ఆవిడే లీసా హేడెన్‌. ఈ భామ రీసెంట్‌గా ల‌వ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ మ్యారేజ్‌లో ఆమె ఫారిన్ స్ట‌యిల్‌లో భ‌ర్త‌కు లిప్ కిస్ ఇచ్చిన ఫోటోని షేర్ అయింది. ఇది వైర‌ల్‌గా మారింది. ఆమెపై చాలా మంది ఓవ‌ర్ చేసిందంటూ హాట్ కామెంట్‌లు షేర్ చేశారు.

ఇది జ‌రిగి నాలుగు రోజులు కావ‌డంలేదు. అంత‌లోనే ఆమె వివాహం రచ్చ ర‌చ్చ అవుతోంది. కొత్త కాపురంలో అడుగుపెట్టి.. భర్త‌తో సుఖ‌సంతోషాల‌తో గ‌డ‌పాల్సిన వివాహం వివాదంగా మారుతోంది. అస‌లు మేట‌ర్ ఏంటంటే.. ఆమె భ‌ర్త డినో ల‌ల్వానీ తండ్రి గులు ల‌ల్వానీ పాకిస్తాన్‌లో జ‌న్మించి బ్రిట‌న్‌లో సెటిల‌యిన పారిశ్రామిక వేత్త‌. తాజాగా ఇండో-పాక్ మ‌ధ్య ర‌గ‌డ జ‌రుగుతుండ‌డంతో పాకిస్తాన్ వ్య‌క్తిని వివాహం చేసుకుంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాకిస్తానీ మూలాలున్న వ్య‌క్తిని పెళ్లి చేసుకుంద‌నే కామెంట్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఉరీ ఘ‌ట‌న త‌ర్వాత భార‌తీయుల మ‌నోభావాలు పూర్తిగా దెబ్బ‌తిన‌డంతో పాక్ వ్య‌క్తిని మ్యారేజ్ చేసుకోవ‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు.

unnamed-1 unnamed

దీంతో, చివ‌రికి కొత్త పెళ్లి కూతురు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. త‌న మామ గులు గుల్వానీ.. స్వాతంత్ర్యానికి ముందు అవిభాజ్య భార‌త‌దేశంలో జ‌న్మించాడ‌ట‌ని, పాక్ ఏర్పాటు త‌ర్వాత భార‌త్‌లోనే ఉంటున్నార‌ని త‌న ట్విట్ట‌ర్‌లో వివ‌ర‌ణ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఇక్క‌డినుంచి బ్రిట‌న్ వెళ్లి అక్క‌డ సెటిల‌య్యాడ‌ని తెలిపింది. తన భర్త పాకిస్తాన్ పౌరుడు కాదని వరుస ట్వీట్లలో వివరించింది. ప్రపంచం ఎప్పుడూ ప్రేమను, ప్రేమికులను కోరుకుంటుంది తప్ప ద్వేషాన్ని ఎప్పుడూ కాదని మరో ట్వీట్ లో లిసా హెడాన్ ఘాటుగా స్పందించింది. మ‌రి, ఆవేద‌న ఎలా ఉన్నా.. పాక్‌పై ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోతున్న భార‌తీయులు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Loading...

Leave a Reply

*