ఎన్టీఆర్‌పై క‌మ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఫోన్ చేసి మరీ చెప్పిన శృతిహాస‌న్‌..!

kamal-hassan-sensational-comments-on-ntr

క‌మ‌ల్‌హాస‌న్‌… ఆయ‌న న‌ట‌శిఖరం… న‌ట‌క‌మ‌లం..మ‌హాన‌టుడు… న‌ట‌న‌కే స‌రికొత్త నిర్వ‌చ‌నం చెప్పిన నిజ‌మైన న‌టుడు…. క‌మ‌ల్‌హాస‌న్ స్టార్ కాదు… సూప‌ర్ స్టార్ కాదు… హీరో అంత‌కంటే కాదు… ఆయ‌న న‌టుడు… త‌న‌లోని న‌టుడ్ని తృప్తి ప‌ర‌చ‌డానికి ఆయ‌న అనిత‌ర సాధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తాడు… క‌మ‌ల్ ఏ పాత్ర పోషించినా దానికి ప్రాణం పోస్తాడు… త‌న పాత్ర‌లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేస్తాడు… కేర‌క్ట‌ర్‌లో ఒదిగిపోయే యాక్ట‌ర్ ఆయ‌న‌… సాగ‌ర‌సంగ‌మం, స్వాతిముత్యం, ఇంద్రుడు చంద్రుడు, విచిత్ర సోద‌రులు, ద‌శావ‌తారం క‌మ‌ల్ చేయ‌ని పాత్ర లేదు… పోషించ‌ని కేర‌క్ట‌ర్ లేదు… ఆయ‌న న‌ట‌కిరీటంలో క‌లికితురాయిలెన్నో ఉన్నాయి… నేటి మేటి న‌టులు ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకోవాల్సిన‌వి ఎన్నో ఉన్నాయి…

అలాంటి మ‌హాన‌టుడు తెలుగులో ఓ టాప్ హీరోను తెగ పొగిడేశారు.. అత‌డు అద్భుతంగా న‌టిస్తాడ‌ని మెచ్చుకున్నారు…. ఆ హీరో ఎవ‌రోకాదు… జూనియ‌ర్ ఎన్టీఆర్‌ట‌… తార‌క్ న‌టన‌కు క‌మ‌ల్ ఫిదా అయిపోయారుట‌…ఈ విష‌యాన్ని క‌మ‌ల్ కూతురు శ్రుతిహాస‌న్ స్వ‌యంగా ఫోన్ చేసి తార‌క్‌కి చెప్పిందిట‌… యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్… ఇప్పుడు తెలుగులో ఉన్న టాప్ న‌టులంద‌రిలోకి మేటి అని చెప్ప‌వ‌చ్చు…న‌ట‌న ఎన్టీఆర్‌కి వెన్న‌తో పెట్టిన విద్య కాదు.. జీన్స్‌తో పెట్టిన విద్య‌…. న‌ట‌న న‌ర‌న‌రాన జీర్ణించుకుపోయింది ఎన్టీఆర్‌కి… దీనికి ఉదాహ‌ర‌ణే క‌మ‌ల్ ప్ర‌శంస‌లు… కొంత‌కాలంగా ఆస్ప‌త్రిలో ఉంటూ బెడ్‌రెస్ట్ తీసుకుంటున్న క‌మ‌ల్‌హాస‌న్ రీసెంట్‌గా డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు… అప్ప‌ట్నించి త‌న హోం థియేట‌ర్‌లో వ‌రుస‌గా సినిమాలు చూస్తున్నారట‌..

తాజాగా ఎన్టీఆర్ సినిమా జ‌న‌తా గ్యారేజ్‌ను శృతిహాస‌న్‌తో క‌లిసిచూశాట్ట క‌మ‌ల్‌… ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పాత్ర‌లో ఒదిగిపోయిన విధానం క‌మ‌ల్‌కి బాగా న‌చ్చింద‌ట‌… ఆయ‌న ఈ విష‌యాన్ని కూతురితో షేర్ చేసుకున్నాట్ట‌.. ఎన్టీఆర్‌తో దోస్తీ ఉన్న శృతి వెంట‌నే తార‌క్‌కి ఫోన్ చేసి అత‌డ్ని క‌మ‌ల్ ఏ రేంజ్‌లో ప్ర‌శంసించాడో వివ‌రించింద‌ట‌..దీంతో తార‌క్ సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నాట్ట‌… న‌ట‌క‌మ‌లం ప్ర‌శంసించ‌డమంటే మామూలు విష‌యం కాదు. దీంతో ఎన్టీఆర్ ఆనందం ప‌ట్ట‌లేక‌పోతున్నాట్ట‌.

Loading...

Leave a Reply

*