ఆ క్రికెట‌ర్ బాగా క్లోజ్‌.. కానీ, పెళ్లి మాత్రం… బాంబ్ పేల్చిన ఐటెంగాళ్‌..!

untitled-15

ల‌క్ష్మీరాయ్‌.. హీరోయిన్‌గా  ఎంట్రీ ఇచ్చి ఐటెంగాళ్‌గా సెటిల‌యిన భామ‌. ఈ ఏడాది ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్‌లో తోబా తోబా అంటూ చిందులేసిన క‌థానాయిక. లారెన్స్ స‌ర‌స‌న న‌టించిన కాంచ‌న త‌ర్వాత ఆమెకు స‌రైన విజ‌యం ద‌క్క‌లేదు. కానీ, ఎప్పుడూ రూమ‌ర్‌లతో, సంచ‌ల‌న విష‌యాల‌తో న్యూస్‌లో ఉంటుంది ల‌క్ష్మీరాయ్‌. ఈ ఐటెం బాంబ్ పేరు వింటేనే ఓ క్రికెటర్ గుర్తుకు వ‌స్తాడు. గ‌తంలో ఆయ‌న‌తో ఆమె ఎంతో క్లోజ్‌గా ఉండేద‌నే ప్రచారం జరిగింది. ఆ పై పెళ్లిదాకా ఆ వార్త‌లు వెళ్లాయి. ఆయన ఎవ‌రో కాదు.. భార‌త వ‌న్ డే క్రికెట్ కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ ధోని. గతంలో అవి రూమ‌ర్‌లే. కానీ, ఇప్పుడు ధోనికి తాను  ఎంతో స‌న్నిహితంగా ఉండేదానిన‌ని చెప్పింది.

2008లో ల‌క్ష్మీరాయ్‌.. చెన్నై ఐపీఎల్ ఫ్రాంచైజీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌నిచేసింది. చెన్నై టీమ్‌కి ధోని కెప్టెన్ అన్న సంగ‌తి తెలిసిందే. అప్పుడే ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా క‌లిసింద‌ట‌. అది ప్ర‌ణ‌యంగా కూడా మారింద‌ట‌. అయితే, ధోనితో తాను ఎంతో క్లోజ్‌గా ఉన్నా.. ఇద్ద‌రి మ‌ధ్య పెళ్లి ప్ర‌స్తావ‌న మాత్రం రాలేద‌ట‌. తొలి సీజ‌న్ ముగిసాక ఇద్ద‌రి మ‌ధ్య స‌రైన మాట‌ల్లేవ‌ని, ప్ర‌స్తుతం ట‌చ్‌లో లేడని వివ‌రించింది ల‌క్ష్మీరాయ్‌. ప్రెజెంట్‌.. ధోని అన్ టోల్డ్ స్టోరీ పేరుతో ధోనీ జీవిత‌గాథ తెర‌కెక్కుతోంది. మ‌రి,  ఈ మూవీలో ల‌క్ష్మీరాయ్ రోల్ ఉంటుందా?  లేదా? అనేది ఆస‌క్తికరంగా మారింది.

 

Loading...

Leave a Reply

*