రాజ‌మౌళికి పెద్ద‌నోట్ల ఎఫెక్టు..

untitled-9

మ‌న ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి పెద్ద‌నోట్ల వ్య‌వ‌హారంపై ఎలాంటి కామెంట్ పోస్టు చేయ‌లేదు. అక్కినేని నాగార్జున‌, ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌.. లాంటి వారు మోడీకి శెభాష్ అంటూ ట్వీట్ చేసి రీట్వీట్‌ల‌నూ అందుకున్నారు. విష‌య‌మేంటంటే రాజ‌మౌళి 500,1000 నోట్ల ర‌ద్దు గురించి ఒక్క‌మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌టం విశేష‌మే. ఆయ‌న న‌వంబ‌రు ఎన‌మిదో తేదీన వ‌ర్మ కొత్త ప్రాజెక్టు న్యూక్లియ‌ర్ గురించి .. ఆర్జీవి బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ లిట‌ర‌ల్లీ.. అంటూ ఆయ‌న ఉద్వేగాన్ని చాటుకున్నారు.

అయితే అంత‌కంటే పేద్ద సంచ‌ల‌నం, బ్లాక్ మ‌నీ దొంగ‌ల‌కి న్యూక్లియ‌ర్ బాంబ్ అయిన పెద్ద నోట్ల వ్య‌వ‌హారం గురించి రాజ‌మౌళి కిమ్మ‌న‌లేదు. బ‌హుశా.. బాహుబ‌లి సెకండ్ పార్ట్‌కు పెద్ద‌నోట్ల వ్య‌వ‌హారం ఇబ్బంది తేవ‌టం వ‌ల్లే ఆయ‌న దాని గురించి స్పందిచ‌లేదేమో అని జ‌నాల గుస‌గుస‌. వాస్త‌వానికి జ‌క్క‌న్న మూడేళ్ల‌కితం డిసెంబ‌ర్ 31 అర్ధ‌రాత్రి ట్రాఫిక్ కానిస్టేబుల్ అవ‌తారం ఎత్తారు. చిన్న‌సినిమాల‌కు త‌న కామెంట్స్‌తో ఊపిరి పోస్తారు.

సంపూలాంటి కామెడీ ఖ‌నిజం ఆయ‌న ట్వీట్ వ‌ల్లే మ‌న‌కు తెలిసింది. ముఖ్యంగా ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళికి సామాజిక విష‌యాల‌పై స్పందించే మంచి మ‌న‌సు ఉంది. అలాంటి ఆయ‌న పెద్ద‌నోట్ల వ్య‌వ‌హారంపై స్పందించ‌కపోవ‌టం వెనుక కార‌ణం ఆయ‌న‌కో, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కో, ఆయ‌న రూపొందిస్తున్న బాహుబ‌లి 2 నిర్మాత‌ల‌కో.. ఏదో ఎఫెక్టు కొట్టిన‌ట్లే ఉంద‌ని కొంద‌రు ప‌రిశీల‌కులు అంటున్నారు.

Loading...

Leave a Reply

*